ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆఫర్.. వద్దంటే ఉద్యోగం పోతుందా? వెళితే ఏం ఇస్తారు?
Advertisement
- మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్
- భారత్ సహా నాలుగు దేశాల్లో ఎంపిక చేసిన ఉద్యోగులకు అవకాశం
- ఉద్యోగి హోదా, సర్వీసు ఆధారంగా పరిహారం
- ఆరోగ్య బీమా, షేర్ల ప్రయోజనాలూ ప్యాకేజీలో భాగం
- ఆఫర్ తిరస్కరిస్తే ఉద్యోగం పోతుందని చెప్పని కంపెనీ
- భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉండదనే హామీ లేకపోవడం గమనార్హం
Advertisement
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కీలక ఆఫర్ ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 60 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలివెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు పరిహారంగా జీతం, ఆరోగ్య బీమా, షేర్ల ప్రయోజనాలు అందించనుంది. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే ఉద్యోగం ఉంటుందా? భవిష్యత్తులో తొలగింపుల ముప్పు ఉంటుందా? అనే సందేహాలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి.
ఎవరెవరికి అవకాశం?
అమెరికా, భారత్, బ్రిటన్, కెనడాలోని ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. సీనియారిటీ స్థాయి 70 వరకు ఉన్నవారిలో అర్హులైన ఉద్యోగులకు ఆఫర్ ఇవ్వనున్నారు. అయితే అన్ని విభాగాల ఉద్యోగులకూ ఇది వర్తించదు. ఆయా విభాగాల అవసరాలను బట్టి అర్హత నిర్ణయిస్తారు.
ఎంత పరిహారం లభిస్తుంది?
ఉద్యోగి హోదా, పనిచేసిన కాలాన్ని బట్టి పరిహారం మారుతుంది. అమెరికా ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ల వివరాల ప్రకారం.. 64వ స్థాయి వరకు ఉన్నవారికి ప్రతి ఆరు నెలల సర్వీసుకు వారం రోజుల ప్రాథమిక వేతనం చొప్పున చెల్లిస్తారు. 65 నుంచి 67 స్థాయుల్లో ఉన్నవారికి ప్రతి ఆరు నెలలకు రెండు వారాల ప్రాథమిక వేతనం లభిస్తుంది. ఈ స్థాయుల్లో పరిహారం గరిష్ఠంగా 39 వారాల వేతనానికి పరిమితం. 68వ స్థాయి ఉద్యోగులకు 12 నెలల జీతానికి సమానమైన పరిహారం అందించే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా, షేర్ల ప్రయోజనాల కొనసాగింపూ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. అయితే ఇవి అమెరికా ఉద్యోగుల ఆఫర్ల వివరాలు. ఇతర దేశాల్లో నిబంధనలు మారవచ్చు.
వద్దంటే ఉద్యోగం పోతుందా?
ఈ ఆఫర్‌ను తిరస్కరించినంత మాత్రాన ఉద్యోగం పోతుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించలేదు. అలా జరుగుతుందని నిర్ధారించే ఆధారాలూ లేవు. అయితే భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉండదనే హామీ కూడా లేదు. సంస్థ అవసరాలను బట్టి తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ ఆరంభంలోగా తమ నిర్ణయం చెప్పాలి. ఆఫర్ అంగీకరించినవారు ఏడాది చివర్లో సంస్థను వీడాల్సి ఉంటుంది.
గతంలోనూ ఇదే తరహా పథకం
ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ మైక్రోసాఫ్ట్ అమెరికాలోని సుమారు 8,750 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. అనంతరం జులైలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 ఉద్యోగాలను తగ్గించింది. అయితే గతంలో ఆఫర్ తిరస్కరించిన వారినే లక్ష్యంగా చేసుకుని తొలగించారని చెప్పడానికి ఆధారాలు లేవు. తాజా పథకం వెనుక సంస్థ వ్యయాలను నియంత్రించడంతోపాటు మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేయాలనేదే లక్ష్యమని తెలుస్తోంది.