ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై ఫిర్యాదు.. నెటిజ‌న్ల‌ విమర్శలతో వెనక్కి త‌గ్గిన హైదరాబాద్ పోలీసులు

Telangana
Advertisement
  • ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై ఫిర్యాదుకు పోలీసుల సమాధానంపై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు
  • వాహనం వెనుక నుంచి ఫొటో తీయడం వల్ల ఉల్లంఘన స్పష్టంగా కనిపించడం లేదన్న పోలీసులు
  • తప్పు తెలుసుకుని పాత రిప్లై డిలీట్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
  • వాహనం వివరాలు సేకరించామని, చర్యలు తీసుకుంటున్నామని కొత్త ప్రకటన
  • వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాత్రమే తప్పనిసరి అని స్పష్టీకరణ
Advertisement
హైదరాబాద్‌లో ఓ వాహనానికి ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై వచ్చిన ఫిర్యాదుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుబట్టడంతో, పోలీసులు తమ మొదటి స్పందనను తొలగించి, తప్పును సరిదిద్దుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 

వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ ఎలక్ట్రిక్ వాహనం ఫొటోను ఓ వ్యక్తి 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వాహనం నంబర్ ప్లేట్‌పై అంకెలను 'SRI' (శ్రీ) అని కనిపించేలా స్టైలిష్‌గా మార్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, సదరు యూజర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. "వాహనం వెనుక నుంచి ఫొటో తీయడం వల్ల ఉల్లంఘన స్పష్టంగా కనిపించడం లేదు. దయచేసి వాహనం ముందు వైపు ఫొటో పంపగలరు" అని రిప్లై ఇచ్చారు. పోలీసుల ఈ సమాధానంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫ్యాన్సీగా మార్చిన నంబర్ ప్లేటే ఉల్లంఘన అని, అది ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నా ముందు వైపు ఫొటో ఎందుకని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు.

నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాము మొదట ఇచ్చిన సమాధానాన్ని డిలీట్ చేశారు. అనంతరం కొత్తగా మరో ప్రకటన విడుదల చేశారు. "ఉల్లంఘనను మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. నంబర్ ప్లేట్‌పై అక్షరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందు, వెనుక రెండు నంబర్ ప్లేట్లకూ నిబంధనలు వర్తిస్తాయి. వాహనం వివరాలు సేకరించాం. మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. వాహనాలకు ప్రభుత్వం నిర్దేశించిన 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు' (హెచ్ఎస్ఆర్‌పీ) మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Hyderabad Traffic PoliceFancy Number Plate ViolationHyderabad Traffic NewsMotor Vehicle ActHSRP Number PlateSocial Media Backlash

More Telugu News

గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్

27 Oct, 11:24

మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అది టైమ్ ట్రావెల్ కాదు, అంతకుమించి!

27 Oct, 11:22

‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’.. ‘కింగ్‌’లో షారుక్‌ అదిరిపోయే లుక్‌

27 Oct, 11:20

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

27 Oct, 11:18

చెప్పాం.. చేస్తున్నాం: కర్నూలు సోలార్ ప్లాంట్‌పై చంద్రబాబు ట్వీట్

27 Oct, 11:11

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్‌ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’

27 Oct, 10:56

ఆర్నబ్ తుపాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక సూచనలు

27 Oct, 10:54

న్యూయార్క్ ఏజీ బరిలో భారత సంతతి మహిళ.. లెటిటియా జేమ్స్‌కు గట్టి పోటీ!

27 Oct, 10:52

ముంచుకొస్తున్న ఆర్నబ్ తుపాను.. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన పవన్

27 Oct, 10:47

బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో మెగాస్టార్ చిరంజీవి?.. నిజమైతే సంచలనమే!

27 Oct, 10:45

ఆటిజం మెదడుపై కొత్త పరిశోధన.. తప్పుల నుంచి ఎలా నేర్చుకుంటారంటే..!

27 Oct, 10:20

రణ్‌బీర్ 'రామాయణ'తో అక్షయ్ కుమార్ 'మొహ్రా' ఢీ.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు

27 Oct, 10:18

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు.. యూట్యూబ్‌కు పోటీగా మెటా కొత్త ప్లాన్‌!

27 Oct, 10:16

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌.. వద్దంటే ఉద్యోగం పోతుందా? వెళితే ఏం ఇస్తారు?

27 Oct, 09:56

పిల్లల ఊపిరితిత్తులపై పొగమంచు పంజా.. దీర్ఘకాలిక ముప్పు తప్పదంటున్న వైద్యులు!

27 Oct, 09:53
..More Telugu News