హైదరాబాద్‌లో అమిత్‌ షా పాదయాత్ర.. కాంగ్రెస్‌ ర్యాలీకి మరుసటి రోజే బీజేపీ కౌంటర్‌!

Telangana
Advertisement
  • నవంబర్‌ 2న హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర
  • అమిత్‌ షా పాల్గొంటారని రామచందర్‌రావు ప్రకటన
  • నవంబర్‌ 1న ఢిల్లీలో కాంగ్రెస్‌ ‘ఓట్‌ చోరీ’ ర్యాలీ
  • ఎస్‌ఐఆర్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం
  • ఓటర్ల పేర్ల తొలగింపుపై రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత సవాల్‌
Advertisement
తెలంగాణలో ఓట్ల తొలగింపు అంశంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. నవంబర్‌ 1న ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న ‘ఓట్‌ చోరీ’ వ్యతిరేక ర్యాలీకి మరుసటి రోజే హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నవంబర్‌ 2న ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘లోక్‌తంత్ర బచావో - అరాజకతా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - అరాచకాన్ని అడ్డుకోండి) నినాదంతో ఈ యాత్ర నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు వెల్లడించారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ఆరోపణలకు సమాధానంగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. 

రాష్ట్రంలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రామచందర్‌రావు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి తనతో కలిసి రావాలని, అక్కడ ఓటర్ల జాబితా నుంచి ఎన్ని పేర్లు తొలగించారో పరిశీలిద్దామని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినట్లు ఆధారాలున్న కనీసం పది మంది ఓటర్ల వివరాలను చూపించాలని తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులను కోరారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లను మళ్లీ చేర్చుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. 

ఎస్‌ఐఆర్‌లో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారన్న ప్రతిపక్ష వాదనలో వాస్తవాలను పరిశీలించాలని రామచందర్‌రావు అన్నారు. ఆ సంఖ్యలో మరణించినవారు, చిరునామా మారినవారు, అందుబాటులో లేనివారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు.

నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఓటర్ల జాబితాల సవరణపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, బీజేపీ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

రామచందర్‌రావు తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, నీటి కొరతను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ ర్యాలీకి వెళ్లడంపై కూడా విమర్శలు చేశారు. రాష్ట్రంలోని 600కు పైగా మండలాల్లో 300కుపైగా మండలాలు కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, హైదరాబాద్‌లో రోజుకు సుమారు 8,000 వాటర్‌ ట్యాంకర్లకు బుకింగ్‌లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Amit ShahHyderabad PadayatraTelangana BJPVoter List Deletion ControversyCongress Vote Chori RallyN Ramchander Rao

More Telugu News

'వాన్‌గార్డ్ డాక్ట్రిన్'.. భారత్‌పై అల్‌ఖైదా కుట్ర.. మళ్లీ పాత వ్యూహానికే పదును!

26 Oct, 18:29

కుమార్తె ప్రేమ గురించి సునీల్ శెట్టికి అలా తెలిసింది!

26 Oct, 18:22

హీరోయిన్లతో కేటీఆర్ దుబాయ్ వెళ్లారు: వెంకట్ బల్మూర్

26 Oct, 18:21

'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

26 Oct, 18:02

జనసేనకు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం

26 Oct, 18:01

విరాట్‌, రోహిత్‌ల తర్వాతి సూపర్‌స్టార్‌ వచ్చేశాడు.. యువ ఆటగాడిపై క్లూసెనర్‌ ప్రశంసలు!

26 Oct, 17:22

ఇలాగైతే ప్రజల మద్దతు పొందలేరు.. ఆ పార్టీ దుకాణం సర్దేసుకోవడం మంచిది: మంత్రి అనగాని

26 Oct, 17:19

విశాఖ స్థానిక ఎన్నికలు: 'సేల్' వర్సెస్ 'సేవ్'.. వైసీపీ కొత్త నినాదం

26 Oct, 17:06

ఏఐ చాట్‌బాట్‌లో ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు.. మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలంటే!

26 Oct, 17:04

అర్ణబ్ తుపాను: ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

26 Oct, 17:00

ఎస్సై ప్రియాంకపై గుంటూరు ఎస్పీకి విడదల రజని ఫిర్యాదు

26 Oct, 16:51

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి.. బాలయ్యకు ఎవరంటే భయం?

26 Oct, 16:48

స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. సెన్సెక్స్‌ 482 పాయింట్లు జంప్‌

26 Oct, 16:28

ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యక్తిగత విమర్శలు చేయను: వంగవీటి రాధా

26 Oct, 16:25
..More Telugu News