పండుగ వేళ లోన్ ఆఫర్ల ఎర: ఉచితం అనుకుంటే బోల్తా పడటం ఖాయం!
Advertisement
- దీపావళి పండుగ ఆఫర్ల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు
- 'జీరో పర్సెంట్ ఇంటరెస్ట్' పేరిట సాగే హిడెన్ ఛార్జీల మాయాజాలం
- నెలవారీ ఈఎంఐ తగ్గింపుతో మొత్తం వడ్డీ భారం పెంపు
- బ్యాంకుల నుంచి డాక్యుమెంట్లు రాబట్టడంపై నిపుణుల సలహాలు
- ఫిర్యాదుల కోసం ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్
Advertisement
పండుగ సీజన్ రాగానే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. ‘సున్నా వడ్డీకే రుణం’, ‘ప్రాసెసింగ్ ఫీజు పూర్తి మినహాయింపు’ అంటూ ఇస్తున్న ఆఫర్లు నిజంగానే మన సొమ్మును ఆదా చేస్తాయా? లేక వినియోగదారుల జేబులకు చిల్లు పెడతాయా? పండుగ వేళ కొత్త కారు, ఇల్లు లేదా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ నిబంధనల వెనుక ఉన్న నిజమైన ఖర్చును కచ్చితంగా అంచనా వేయాలని ఫైనాన్స్, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీరో ఇంటరెస్ట్ స్కీమ్‌ల వెనుక 'దాగి ఉన్న' బాదుడు
చాలామంది జీరో ఇంటరెస్ట్ అనగానే ఏ ఒక్క రూపాయి అదనంగా చెల్లించక్కర్లేదని భావిస్తారు. కానీ ఫైనాన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఛార్జీలు వేరే రూపంలో దాగి ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు ఈఎంఐలు, అడ్వాన్స్ డౌన్ పేమెంట్లు లేదా తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపంలో డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి వస్తువు అసలు నగదు ధరకు, రుణం ద్వారా చెల్లించే మొత్తం ధరకు ఉన్న తేడాను పోల్చి చూస్తేనే ఆఫర్ అసలు రంగు బయటపడుతుంది.
పెరుగుతున్న రుణాల పరిమాణం
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్యాసింజర్ వాహనాల సగటు రుణ మొత్తం రూ. 8.2 లక్షలకు చేరింది. అదే సమయంలో ఈ రుణాలు తీర్చే వ్యవధి కూడా సగటున 62 నెలలకు పెరిగింది. ఈఎంఐ తగ్గుతోందని ఎక్కువ కాల పరిమితిని ఎంచుకుంటే, చివరకు చెల్లించే మొత్తం వడ్డీ భారం భారీగా పెరుగుతుంది. ప్రతి వ్యక్తి తన నెలవారీ చేతికి వచ్చే ఆదాయంలో లోన్ ఈఎంఐలు 40 శాతానికి మించకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆఫర్ ప్రకటనలు వేరు.. మీ చేతికి వచ్చే అగ్రిమెంట్ వేరు!
బ్యాంకులు పాంప్లెట్లలో వేసే వడ్డీ రేట్లు కేవలం అత్యుత్తమ క్రెడిట్ స్కోర్ ఉన్న కొద్దిమందికి మాత్రమే వర్తిస్తాయి. మనకు వర్తించే రేటు మన సిబిల్ స్కోర్, ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంతకం చేసే ముందు 'కీ ఫ్యాక్ట్స్ స్టేట్‌మెంట్ (కేఎఫ్ఎస్)', 'యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్)' వంటి కీలక వివరాలను అడిగి తెలుసుకోవాలి.
సమస్య వస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
ఒకవేళ ఫైనాన్స్ సంస్థలు వాగ్దానం చేసిన ఆఫర్లను అగ్రిమెంట్‌లో ఇవ్వకపోతే లేదా అదనపు ఛార్జీలు బాదితే ఊరుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా సదరు డీలర్ లేదా బ్యాంకుకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఫలితం లేకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ లేదా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (1915) ద్వారా న్యాయం పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.