ఏపీ వైపు దూసుకొస్తున్న 'అర్ణబ్'.. అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు

25-10-2026 Sun 18:24 | Andhra
Advertisement
  • ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు
  • అక్టోబర్ 28న బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
  • తీరం దాటే సమయంలో గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు
  • భారీ వర్ష సూచనతో అప్రమత్తమైన ప్రభుత్వం, రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
  • తుఫాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్ణబ్’ తుపానుగా బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ గుప్తా, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీ అధికారులతో పాటు వ్యవసాయ, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్యారోగ్య, పౌరసరఫరాలు, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, పక్కా ప్రణాళికతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లు, కాకినాడకు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం వేగంగా బలపడుతోంది. ఇది అక్టోబర్ 26 ఉదయానికి తుపానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుపానుగా, 27వ తేదీ నాటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్టోబర్ 28న ఉదయం నుంచి మధ్యాహ్నం లోగా బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.

భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలపై గాలులు, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు వర్షపాతం 95 మి.మీ.గా ఉంటుందని అంచనా వేశారు.

చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లన్నీ వెంటనే తీరానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 

విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామగ్రితో బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని రిజర్వాయర్లలోకి మళ్లించి, నీటిని నిల్వ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement
Chandrababu NaiduCyclone ArnabAndhra Pradesh WeatherBay of Bengal StormVisakhapatnam Heavy RainNDRF Rescue Teams

More Telugu News

"మోదీ అబ్బ కూడా దిగిపోవాల్సిందే".. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

25-10-2026 Sun 20:28

14 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. వైభవంగా అర్జున్ చిన్న కుమార్తె వివాహం!

25-10-2026 Sun 20:07

టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. రూ.600కే హైదరాబాద్‌లో వారమంతా బస్సు ప్రయాణం!

25-10-2026 Sun 19:48

నీళ్ల కంటే పెట్రోల్ చౌక.. భారతీయులకు వీసా ఫ్రీ.. ఈ చిన్న దేశం గురించి తెలుసా?

25-10-2026 Sun 19:36

మాదాపూర్‌లో విషాద ఘటన.. ఫ్యాన్‌కు ఉరేసుకుని మహిళా టెక్కీ ఆత్మహత్య

25-10-2026 Sun 19:11

అనుకోని ఆలింగనం.. దుకాణదారుడికి హగ్ ఇచ్చి వెళ్లిన కొండముచ్చు.. వైరల్ వీడియో ఇదిగో!

25-10-2026 Sun 18:59

యోగాలో ఇది అత్యంత శక్తిమంతమైనది, ప్రమాదకరమైనది కూడా: సద్గురు హెచ్చరిక

25-10-2026 Sun 18:48

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్

25-10-2026 Sun 18:39

హర్మన్ సెంచరీ, దీప్తి రికార్డు శతకం.. వడోదరలో టీమిండియా పరుగుల వెల్లువ

25-10-2026 Sun 18:33

ఆగర్భ శత్రువులను సైతం పెళ్లి వేడుక కలుపుతుంది.. కానీ జగన్ మాత్రం..!: బుద్ధా వెంకన్న

25-10-2026 Sun 17:31

"మేం ఏం తప్పు చేశాం?".. యూరప్ లో భారత జంటకు రూ.13 వేల ఫైన్

25-10-2026 Sun 17:19

అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!

25-10-2026 Sun 17:08

జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు

25-10-2026 Sun 17:01

మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!

25-10-2026 Sun 16:53
..more