సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
Advertisement
- పవన్ కుమార్ హనీట్రాప్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
- నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వెయ్యి మందిని బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఆరోపణ
- బాధితుల్లో డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు ఉన్నట్లు పోలీసుల అనుమానం
- ఇన్‌స్పెక్టర్ భార్య ఫిర్యాదుతో మరో కేసు నమోదు
- నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
Advertisement
హైదరాబాద్ పోలీసు శాఖను కుదిపేస్తున్న హనీట్రాప్ కింగ్ పవన్ కుమార్ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బలహీనతను పసిగట్టి, చాకచక్యంగా లాడ్జికి రప్పించి, రహస్యంగా వీడియోలు తీసి.. ఆయనను దాదాపు ఆరు నెలల పాటు మానసిక బందీగా మార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో విడతలవారీగా రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు తాజా విచారణలో తేలింది. నిందితుడు బ్లాక్మెయిల్కు పాల్పడిన తీరు పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది.
లాడ్జికి పిలిపించి.. వల పన్నిందిలా!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫేస్బుక్లో మహిళ పేరుతో ఉన్న నకిలీ ఖాతా ద్వారా పవన్ కుమార్ సదరు సీఐతో పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల సంభాషణలోనే ఆ అధికారికున్న ఓ బలహీనతను పసిగట్టాడు. దాన్ని ఆసరాగా చేసుకుని, లాడ్జిలో కలుద్దామని ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన సీఐకి తెలియకుండా ఏకాంత క్షణాలను తన సెల్ఫోన్లో రహస్యంగా చిత్రీకరించాడు. ఆ తర్వాత అసలు స్వరూపం బయటపెట్టాడు. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, ఉన్నతాధికారులకు పంపుతానని బెదిరింపులకు దిగాడు. పరువు పోతుందన్న భయంతో సీఐ పూర్తిగా లొంగిపోయాడు. అప్పటి నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఆయన్ను మానసికంగా హింసిస్తూ, తనతో పాటే లాడ్జిలో ఉండేలా ఒత్తిడి తెచ్చాడు.
తల్లి చావుకూ వెళ్లకుండా పైశాచికత్వం!
బ్లాక్మెయిల్కు గురిచేస్తున్న సమయంలోనే పవన్ కన్నతల్లి అనారోగ్యంతో మరణించింది. అయితే, తాను అంత్యక్రియలకు వెళితే సీఐ తన చేజారిపోతాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తాడన్న అనుమానంతో కడసారి చూపునకు కూడా వెళ్లలేదు. సీఐని తన కబంధ హస్తాల్లోంచి బయటకు వెళ్లనివ్వకుండా బందీగా ఉంచిన ఈ ఉదంతం, అతని పైశాచికత్వానికి, డబ్బుపై అతడికున్న వ్యామోహానికి పరాకాష్టగా నిలుస్తోందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
భార్య ఫిర్యాదుతో మరో కేసు
గతంలో పవన్పై ఓ యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, తాజాగా సీఐ భార్య సైతం పోలీసులను ఆశ్రయించారు. తన భర్తను హనీట్రాప్ చేసి, మానసికంగా వేధించి లక్షల రూపాయలు గుంజిన పవన్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు పవన్పై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుల్లో డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు సహా మొత్తం ఆరుగురు పోలీసు అధికారులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న పవన్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ విచారణలో వెయ్యి మంది బాధితుల గుట్టుతో పాటు మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.