పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03 | Andhra
Advertisement
  • న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. కీలక పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్లు
  • మైదానంలో తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో ఆడిన తిలక్, నితీశ్
  • మన కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించిన మంత్రి నారా లోకేశ్
  • వారి సంభాషణకు సంబంధించిన క్రిక్‌బజ్ వీడియోను పంచుకున్న లోకేశ్
  • కామెంటేటర్లు హర్షా భోగ్లే, దినేశ్ కార్తీక్ కూడా తెలుగు మాట్లాడటం విశేషం
Advertisement
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో టీమిండియాను గెలిపించారు. ఓటమి అంచున ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, మైదానంలో ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటూ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రదర్శనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మేరకు లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయ పూర్వక అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఓటమి అంచుల నుంచి సమన్వయంతో ఆడి జట్టును గెలిపించారని కొనియాడారు. దీనికి సంబంధించిన క్రిక్‌బజ్ వీడియోను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు.

లోకేశ్ పంచుకున్న ఈ వీడియోలో తిలక్, నితీశ్ క్రీజులో ఉండగా ఒకరితో ఒకరు తెలుగులో మాట్లాడుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది. వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో తెలుగులోనే చర్చించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో మరో విశేషం కూడా ఉంది. ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా తెలుగులో మాట్లాడారు.

హర్షా భోగ్లే పక్కా హైదరాబాదీ కాగా, దినేశ్ కార్తీక్‌ మూలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ షోకు హోస్ట్‌గా ఉన్న నటి సయామీ ఖేర్, సాయి దుర్గా తేజ్ తొలి చిత్రం 'రేయ్' లో హీరోయిన్‌గా నటించడం గమనార్హం. మొత్తం మీద, కేవలం క్రీడా విజయమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై తెలుగు భాషకు దక్కిన గౌరవంగా ఈ సంఘటనను పలువురు అభివర్ణిస్తున్నారు.
Advertisement
Tilak VarmaNitish Kumar ReddyNara LokeshIndia vs New Zealand T20Telugu cricketers viral videoHarsha Bhogle Telugu commentary

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more