ఎస్ఈసీ, పోలీసులపై అంబటి ఫైర్.. రజనిపై దాడి దారుణమన్న మాజీ మంత్రి
Advertisement
- ఎస్ఈసీ, పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అంబటి
- నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపణ
- జనసేన, బీజేపీ అభ్యర్థులపైనా టీడీపీ దాడులు చేస్తోందని విమర్శ
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తూ ఎన్నికలు నిర్వహించడం ఎందుకని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) న్యాయం, ధర్మంతో కాకుండా టీడీపీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు.
నామినేషన్ కేంద్రాల్లో పోలీసులు, టీడీపీ నాయకులు కలిసి వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని, వారిపై దాడులు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు దాడి చేయడం దారుణమని, తమ నేతలను ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగకపోతే అది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని అన్నారు.
కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ అభ్యర్థులను కూడా టీడీపీ వాళ్లు కొడుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబును మోస్తున్న జనసేన నాయకులపైనే దాడులు జరుగుతున్నాయని, పవన్ కల్యాణ్ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ గూండాలు మహిళల చీరలు లాగుతూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ఈ అరాచకాలకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తప్పకుండా పర్యవసానాలు అనుభవిస్తారని అంబటి రాంబాబు హెచ్చరించారు.