డైటింగ్‌తో తగ్గిన బరువు మళ్లీ పెరుగుతోందా? అసలు ఎందుకు అలా జరుగుతుంది?
Advertisement
- డైటింగ్ తర్వాత బరువు మళ్లీ పెరగడానికి శరీర మార్పులే కారణమంటున్న నిపుణులు
- లెప్టిన్ తగ్గడం, గ్రెలిన్ పెరగడం ఆకలిని పెంచే అవకాశం
- బరువు తగ్గినప్పుడు శరీరానికి అవసరమయ్యే కేలరీలు తగ్గుతాయి
- అతిగా డైటింగ్ చేయడం వల్ల కండరాలు తగ్గి అలసట పెరిగే ఛాన్స్
- నిద్రలేమి, ఒత్తిడి, శారీరక కదలికలు తగ్గడం వల్ల కూడా ప్రభావం
Advertisement
బరువు తగ్గడానికి నెలల తరబడి డైటింగ్ చేస్తారు. నచ్చిన ఆహారాన్ని తగ్గించుకుంటారు. వ్యాయామంతో చెమటోడుస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక ఎంతో సంతోషిస్తారు. కానీ కొంతకాలానికి తగ్గిన బరువు మళ్లీ పెరుగుతుంది. దీంతో చాలామంది తమ ప్రయత్నంలో లోపం ఉందని భావిస్తారు. అయితే, బరువు తగ్గిన తర్వాత శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, ఆకలి పెరగడం, శక్తి వినియోగం తగ్గడం కూడా ఇందుకు కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆకలిని పెంచే హార్మోన్లు
శరీరంలో కొవ్వు తగ్గినప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ స్థాయులు పడిపోతాయి. ఇది మెదడుకు శరీరంలో నిల్వ ఉన్న శక్తి గురించి సంకేతాలిస్తుంది. దీని స్థాయులు తగ్గితే ఆకలి పెరగవచ్చు. మరోవైపు ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయులు కూడా పెరగవచ్చు. దీంతో తిన్న తర్వాత కడుపు నిండిన భావన తగ్గి, మళ్లీ తినాలనిపిస్తుంది.
తక్కువ కేలరీలతోనే శరీరం పనిచేస్తుంది
బరువు తగ్గినప్పుడు శరీర పరిమాణం తగ్గుతుంది. దీంతో రోజువారీ పనులకు అవసరమయ్యే కేలరీలు కూడా తగ్గుతాయి. కొందరిలో శరీరం అంచనా వేసిన దానికంటే తక్కువ శక్తిని వినియోగించేలా మారుతుంది. ఈ మార్పును అడాప్టివ్ థర్మోజెనెసిస్ అంటారు. ఫలితంగా బరువు తగ్గడం, తగ్గిన బరువును అలాగే ఉంచుకోవడం కష్టమవుతుంది.
అతిగా డైటింగ్ చేస్తే ఇబ్బందులే
కేలరీలను మరీ ఎక్కువగా తగ్గించడం, ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం, కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడం వల్ల అలసట పెరుగుతుంది. రోజువారీ పనులు, నడక వంటి శారీరక కదలికలు తగ్గుతాయి. దీంతో ఖర్చయ్యే కేలరీలు కూడా తగ్గుతాయి. తగినంత ప్రొటీన్ తీసుకోకపోవడం, కండరాలకు వ్యాయామం లేకపోవడం వల్ల కండరాల పరిమాణం తగ్గవచ్చు. నిద్రలేమి, ఒత్తిడి, రోజువారీ అలవాట్లలో మార్పులు కూడా బరువు మళ్లీ పెరగడానికి దోహదపడతాయి.
బరువు నిలకడగా ఉండాలంటే..
ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గాలని కాకుండా, పోషకాలు అందే ఆహారంతో నెమ్మదిగా కొవ్వు తగ్గించుకోవడం మంచిది. నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలతో పాటు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. తగినంత ప్రొటీన్ తీసుకోవాలి. నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువు మళ్లీ పెరుగుతుంటే వైద్యులను సంప్రదించి హార్మోన్లు, మందుల ప్రభావం, నిద్ర సమస్యల వంటి కారణాలను పరిశీలించుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణలో దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి రావచ్చు.