Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

Paris shooting incident one dead and four injured in suburbs
Advertisement
  • నిందితుడిని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ ప్రధాని
  • కారులోంచి దుండగుడు కాల్పులు జరిపినట్లు వెల్లడించిన స్థానిక మేయర్
  • జాతి, మత వివక్ష కోణంలోనూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Advertisement
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ కస్టడీకి తరలించినట్లు ఆయన 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

ప్యారిస్‌కు పశ్చిమ దిశలో సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్న యెవెలైన్స్ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోని ట్రాపెస్, లా వెరియర్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కారులో నుంచి ప్రజలపై కాల్పులకు తెగబడ్డాడని ట్రాపెస్ మేయర్ అలీ రబే తెలిపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ-టెర్రరిజం ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. అరెస్టయిన వ్యక్తిపై హత్య, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటంతో సహా మొత్తం నాలుగు అభియోగాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జాతి, తెగ, మతం వంటి అంశాల ఆధారంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం నిందితుడిని అధికారులు విచారిస్తుండగా, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement
Paris Shooting
France shooting news
Trappes shooting incident
Sebastien Lecornu
France anti terrorism investigation

More Telugu News