Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగ్గురు ఐపీఎస్‌లను తొలగించండి.. రాష్ట్రపతికి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ

MP Gurumoorthy writes to President to remove three IPS officers
Advertisement
  • కోయ ప్రవీణ్, ధీరజ్ కనుబిల్లి, షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్న గురుమూర్తి
  • అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ఆరోపణ
  • స్థానిక ఎన్నికల నామినేషన్ల ఘర్షణల నేపథ్యంలో పరిణామం
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సహా పలువురు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.

డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలోనూ డీఐజీ కోయ ప్రవీణ్‌పై పక్షపాత ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయన్ను విధుల నుంచి తొలగించిందని, అలాంటి అధికారిని మళ్లీ నియమించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పుంగనూరు, పులివెందుల, కమలాపురం, బద్వేల్ వంటి ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయని, వారిని అడ్డుకున్నారని గురుమూర్తి ఆరోపించారు. ముఖ్యంగా పుంగనూరులో తమ పార్టీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేకపోయిందని పేర్కొన్నారు. పోలీసుల పక్షపాత వైఖరి, పర్యవేక్షణ లోపాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, అభ్యర్థులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని ఆయన తన లేఖలో కోరారు.
Advertisement
Advertisement
Maddila Gurumoorthy
YSRCP
Andhra Pradesh Police
IPS Koya Praveen
Local Body Elections
Punganur Nominations

More Telugu News