అరుణాచల్ సరిహద్దులో చైనా సైనికులతో కొనసాగుతున్న ఘర్షణలు.. ఐటీబీపీ చీఫ్ కీలక ప్రకటన
- ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్ వెల్లడి
- ఘర్షణల్లో షౌర్య కమాండోలు ప్రతిభ చూపారని ప్రశంస
- చైనాతో 3,488 కిలోమీటర్ల ఎల్ఏసీకి ఐటీబీపీ కాపలా
- అన్ని సరిహద్దు యూనిట్లలో డ్రోన్ ప్లటూన్ల ఏర్పాటు
- గల్వాన్ తరహా పరిస్థితుల కోసం ప్రత్యేక శిక్షణ
అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో చైనా సైనికులతో పలుచోట్ల ముఖాముఖి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ఈశాన్య సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిపై అధికారికంగా ఈ స్థాయిలో వెల్లడించడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
‘‘గత కొన్ని రోజులుగా అరుణాచల్‌లో పలుచోట్ల చైనా సైనికులతో ముఖాముఖి పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి’’ అని ఐటీబీపీ సిబ్బంది వార్షిక సత్కార కార్యక్రమంలో కపూర్ తెలిపారు. ఈ పరిణామాల్లో ఐటీబీపీకి చెందిన షౌర్య కమాండోలు అసాధారణ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు.
ఎత్తైన ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ
ఎత్తైన పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందినవారే షౌర్య కమాండోలు. సరిహద్దుల్లో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ఐటీబీపీ చీఫ్ చెప్పారు. 1962లో ఏర్పాటైన ఈ బలగం చైనాతో ఉన్న 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కాపలా బాధ్యతలు చూస్తుంటుంది. 2004లో సరిహద్దు రక్షణ బాధ్యతలు అప్పగించినప్పటికీ, పర్వత ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధానికి సంబంధించిన తమ అసలు నైపుణ్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కపూర్ పేర్కొన్నారు.
డ్రోన్లతో నిఘా.. భూగర్భ నిర్మాణాలు
చైనాతో ఉన్న సరిహద్దు అత్యంత క్లిష్టమైనదని ఐటీబీపీ డీజీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని యూనిట్లలో డ్రోన్ ప్లటూన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గల్వాన్ లోయ తరహా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోరాట శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. భూగర్భ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే తాజా ముఖాముఖి ఘటనలు ఏ ప్రాంతాల్లో జరిగాయి? ఎంతమంది సైనికులు పాల్గొన్నారు? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే వివరాలను ఐటీబీపీ చీఫ్ వెల్లడించలేదు.