ఏపీలో నామినేషన్ల హింస.. 54 మందిపై కేసులు నమోదు చేశామన్న డీజీపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో నామినేషన్ల హింస.. 54 మందిపై కేసులు నమోదు చేశామన్న డీజీపీ

Harish Kumar Gupta DGP cases registered against 54 people regardless of party for nomination violence
  • రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 31 ఘర్షణలు, దాడుల కేసుల నమోదు
  • వాహనాల దహనం, జేసీబితో ఇల్లు కూల్చివేత
  • ఓ అభ్యర్థిని తరలిస్తున్న పోలీసు వాహనంపై దాడి
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు, దాడులు చోటుచేసుకోవడంతో, ఈ ఘటనలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో హింసకు పాల్పడేవారు, నామినేషన్లను అడ్డుకునేవారు ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిన్న ఒక్కరోజే 13 జిల్లాల్లో 31 ఘటనలు నమోదైనట్లు వెల్లడించారు.

ఈ ఘటనల్లో 22 హింసాత్మక ఘర్షణలు కాగా, 9 నామినేషన్ పత్రాలను చించివేయడం లేదా లాక్కోవడం వంటివి ఉన్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8 ఘటనలు జరిగాయి. అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లో మూడేసి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు సహా నాలుగు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లు, కర్రలతో దాడులు, ఒకచోట జేసీబీతో ఇంటిని కూల్చివేయడం, గాల్లోకి కాల్పులు జరపడం వంటి ఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ అభ్యర్థిని తరలిస్తున్న పోలీసు వాహనంపై జరిగిన రాళ్లదాడిలో కానిస్టేబుల్‌కు తలకు తీవ్రగాయమైంది. ఒక అభ్యర్థితో సహా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసి, 54 మంది నిందితులను గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. నిందితులు టీడీపీ, వైసీపీ, సీపీఎం, స్వతంత్రులుగా ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను వెంటనే నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని, సున్నితమైన కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎలాంటి బెదిరింపులు లేదా హింసకు గురైనా వెంటనే డయల్ 100 లేదా 112కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. 
Advertisement
Harish Kumar Gupta
Andhra Pradesh Election Violence
MPTC ZPTC Nomination Clashes
TDP YCP CPM Cases Registered
Anantapur Election Violence
Andhra Pradesh DGP Warning

More Telugu News