టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. మహిళల నెట్‌వర్క్‌పై అనుమానాలు!
- టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో మరో మహిళ అదుపులోకి
- సోనిపట్‌లో సమీర్, జతిన్, అంకిత్ ఖటక్ అరెస్ట్
- కేసులో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరినట్లు సమాచారం
- ఇప్పటికే ఢిల్లీలో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
- కుట్రలో సమీర్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానం
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో మహిళల నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్.. తాజాగా మరో మహిళను విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. మరోవైపు హర్యానాలోని సోనిపట్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరినట్లు సమాచారం.
అదుపులోకి తీసుకున్న మహిళను ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ అధికారులు విచారిస్తున్నారు. అయితే కాల్పుల ఘటనలో ఆమె పాత్ర ఏంటి? ఇతర నిందితులతో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అంతకుముందు ఈ కేసులో రాధ, బబిత అనే ఇద్దరు మహిళలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
మరోవైపు సోనిపట్‌లో సమీర్, జతిన్, అంకిత్ ఖటక్‌లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ముంబైకి తీసుకొచ్చారు. త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు రాజస్థాన్‌లోని కోటా, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాల్పుల కుట్రలో సమీర్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ పండిట్‌కు, కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెహాన్‌కు మధ్య అతడు అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి డబ్బు, ఆయుధాలు సమకూర్చడంలోనూ అతడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జతిన్, అంకిత్ ఖటక్‌ల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా బాధ్యత ప్రకటించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ గ్యాంగ్ తరఫున అనిల్ పండిట్ సందేశాలు పోస్టు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.