చరిత్రలోనే అత్యంత బలమైన ఎల్నినో.. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు!
- పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల వరకు పెరిగే అవకాశం
- భారత్లో శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం తగ్గుదల అంచనా
- కొన్ని దేశాల్లో వరదలు, మరికొన్ని దేశాల్లో తీవ్ర కరవు పరిస్థితులు
- ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్న డబ్ల్యూఎంవో
ప్రపంచ వాతావరణంపై ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో.. గతంలో ఎన్నడూ చూడని తీవ్రస్థాయికి చేరుకోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది నవంబరు నుంచి 2027 జనవరి మధ్య కాలంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కన్నా 3.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు పెరిగితేనే ఎల్నినోగా ప్రకటిస్తారు. కానీ ఈసారి ఏకంగా 3.8 డిగ్రీల పెరుగుదల ఉంటుందన్న అంచనా వాతావరణ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబరు నాటికి ఇది గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని డబ్ల్యూఎంవో తెలిపింది. గత నాలుగు దశాబ్దాల వాతావరణ చార్ట్ల అంచనాలకు మించి ప్రస్తుత పరిస్థితి ఉందని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తీవ్రమైన ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులకు కారణం కానుంది. ముఖ్యంగా భారత్ సహా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో శీతాకాలంలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంపై, తాగునీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మరోవైపు, తూర్పు ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో పొడి వాతావరణం, మధ్య అమెరికా, అమెజాన్ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. చాలా బలమైన ఎల్నినో.. సాధారణ ఉష్ణోగ్రతలను, వర్షపాత సరళిని పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొంది.
2026 చివరి నాటికి ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ, దాని ప్రభావాలు చాలా కాలం పాటు కొనసాగుతాయని సెలెస్టే సౌలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.