స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేకే జగన్ నాటకాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
Advertisement
- మంగళగిరిలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం
- గతంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు ఇతరులపై నిందలు వేస్తున్నారని ఆరోపణ
- పోటీకి అభ్యర్థులు దొరక్కనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని వెల్లడి
- పులివెందుల, పుంగనూరు, దర్శిలో వైసీపీ నేతలే దాడులకు పాల్పడ్డారని ఆక్షేపణ
- జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఈసీ సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేక, ఓటమి భయంతోనే వైసీపీ అధినేత జగన్ నాటకాలాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే, దానిని జీర్ణించుకోలేక జగన్ రోజుకో నాటకానికి తెరతీస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అడ్డదారులు తొక్కేందుకు చట్టం అంగీకరించకపోవడంతో జగన్ తట్టుకోలేక ‘ప్రజాస్వామ్యం ఖూనీ’ అయిందంటూ గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు "ఖూనీ" అనే పదానికి పేటెంట్ వైఎస్ కుటుంబానిదేనని, ఇప్పుడు ఆ పదాన్ని ఇతరులకు ఆపాదించడం మానుకోవాలని హితవు పలికారు.
గతంలో వారి పాలనలో వ్యవస్థలను నాశనం చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ఓటమి భయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భూమిరెడ్డి ఆరోపించారు. "ప్రపంచంలో తనకంటే పెద్ద శాంతిదూత లేరన్నట్లు జగన్ ప్రవర్తిస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న సామెత గుర్తొస్తోంది. ఆయన రాజకీయ ప్రస్థానమంతా హింస, దౌర్జన్యాలు, హత్యల పునాదులపైనే మొదలైంది. రక్తపు కూడు తింటూ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వైఎస్ కుటుంబానికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు" అని ధ్వజమెత్తారు.
పులివెందులకు ఇప్పుడే నిజమైన స్వాతంత్ర్యం
దేశానికి 1947లో స్వాతంత్ర్యం వస్తే, వైఎస్ కుటుంబం చేతిలో బందీగా ఉన్న పులివెందుల ప్రజలకు 2026 అక్టోబర్‌లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని భూమిరెడ్డి వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా ప్రజల ఓట్లను తామే వేసుకుంటూ లక్షల మెజారిటీలతో విర్రవీగిన వారికి, ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి పోటీకి వస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. "పులివెందులలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటే కూటమి కార్యకర్తలు కనీసం గిచ్చారా? కానీ మా అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయానికి మారణాయుధాలతో వేలాది మంది వచ్చి పోలీసులపైనే హత్యాయత్నాలకు పాల్పడ్డారు" అని ఆరోపించారు.
పోటీకి అభ్యర్థులే దొరకక, ఆ అసహనంతోనే వైసీపీ గొడవలకు దిగుతోందని ఆయన అన్నారు. గతంలో వందల కోట్ల పనులు చేయించుకుని కార్యకర్తలకు బిల్లులు చెల్లించకపోవడంతో వారే ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు. పుంగనూరులో మిథున్ రెడ్డి తన కాన్వాయ్‌తో టీడీపీ కార్యకర్తలపైకి వాహనాలను ఎక్కించి గాయపరిచారని, దర్శిలో పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా ర్యాలీగా వచ్చి ఎస్సై తల పగలగొట్టారని మండిపడ్డారు.
గతంలో దాడులు, ఇప్పుడు డ్రామాలు
గత వైసీపీ ప్రభుత్వంలో తమపై 322 ఎఫ్‌ఐఆర్‌లు పెట్టించి, 48 మందిని కిడ్నాప్ చేసి, 160 మందిపై భౌతిక దాడులకు పాల్పడి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర జగన్‌ది కాదా అని భూమిరెడ్డి ప్రశ్నించారు. "నాడు మీరు విత్తిన అరాచక బీజాలే నేడు చెట్టయి మీకు ఎదురుతిరుగుతున్నాయి. బైబిల్‌లో చెప్పినట్లు కత్తి ఎత్తినవాడు కత్తికే నాశనమౌతాడు" అని హెచ్చరించారు. తన ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించినప్పుడు జగన్‌కు నిష్పక్షపాత వైఖరి గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటే, జగన్ మాత్రం తన కార్యకర్తలను రెచ్చగొడుతూ బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలను వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో వ్యాపారంగా మార్చుకున్నారని, మేయర్ పదవికి రూ.10 కోట్లు, చైర్మన్ పదవికి రూ.5 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తాము మాత్రం ప్రజామోదం ఉన్నవారికే టికెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు సంయమనంతో వ్యవహరిస్తున్నామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఈ ప్రభుత్వంలో చెల్లదని రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొడుతున్న జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.