ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్‌లపై కేంద్రం ఫోకస్.. మెటాకు కీలక ఆదేశాలు!
- ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్‌ల సమీక్షకు కేంద్రం ఆదేశాలు
- ఒకే రకమైన సమాచారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వొద్దని సూచన
- తప్పుడు ప్రచారం, హింసకు దారితీసే కంటెంట్‌పై వేగంగా చర్యలు
- పాత వీడియోలను తాజా ఘటనలుగా చూపించకుండా జాగ్రత్తలు
- ఆదేశాలను వెంటనే అమలు చేసి నివేదిక ఇవ్వాలని మెటాకు సూచన
- ఆగస్టులోనూ డీప్‌ఫేక్‌లు, అల్గారిథమ్‌లపై మెటాను ప్రశ్నించిన అధికారులు
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్టులు ఎక్కువ మందికి కనిపించాలనే విషయాన్ని నిర్ణయించే సిఫార్సుల వ్యవస్థలను (రికమెండేషన్ అల్గారిథమ్‌లు) సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థను ఆదేశించింది. ఒకే రకమైన సమాచారం లేదా పరిమిత అభిప్రాయాలే వినియోగదారులకు ఎక్కువగా కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలకు విభిన్నమైన, వారికి అవసరమైన, విశ్వసనీయమైన సమాచారం అందేలా చూడాలని కోరింది.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ మేరకు మెటాకు అడ్వైజరీ జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. సోషల్ మీడియా అల్గారిథమ్‌ల ద్వారా కొన్ని వార్తలు, వీడియోలు భారీగా వ్యాప్తి చెందుతున్న తీరుపై కేంద్రం దృష్టి సారించింది. ప్రజల్లో గందరగోళం, హింస లేదా శాంతిభద్రతల సమస్యలకు దారితీసే అవకాశం ఉన్న కంటెంట్‌ను త్వరగా గుర్తించి, పరిశీలించి, సంబంధిత అధికారులకు చేరవేసే వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించింది.
ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, తీసుకున్న చర్యల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని మెటాను కోరింది.
ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. వాటి నిజానిజాలు, చిత్రీకరించిన సమయం, ప్రదేశం స్పష్టంగా తెలియనప్పుడు తగిన సందర్భాన్ని వివరించే సమాచారం అందించాలని పేర్కొంది.
గతంలో తీసిన లేదా వేరే ఘటనకు సంబంధించిన దృశ్యాలను ప్రస్తుత సంఘటనకు చెందినవిగా చూపించినప్పుడు, వీడియోలను కొంతవరకే ఎడిట్ చేసి ప్రచారం చేసినప్పుడు, అత్యవసర పరిస్థితులు లేదా పోలీసుల చర్యలపై నిర్ధారణ కాని ఆరోపణలు చేసినప్పుడు వాటి గురించి అదనపు వివరాలు అందించాలని సూచించింది. ఇలాంటి కంటెంట్ వల్ల ప్రజలు తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
మెటా కార్యకలాపాలపై కేంద్రం పర్యవేక్షణ పెంచుతున్న నేపథ్యంలో ఈ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ ప్రభుత్వ అధికారులు మెటా ప్రతినిధులను ప్రశ్నించారు. కంటెంట్ సిఫార్సుల అల్గారిథమ్‌లు, డీప్‌ఫేక్‌లు, ఏఐతో సృష్టించే నకిలీ కంటెంట్, చట్టవిరుద్ధమైన సమాచారాన్ని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగారు.
మరోవైపు, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను అడ్డుకునేందుకు మెటా తన భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేసింది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య భారత్‌లో ఇలాంటి 53 లక్షల కంటెంట్ అంశాలను తొలగించినట్లు సంస్థ ఈ నెల ప్రారంభంలో వెల్లడించింది. వీటిలో 98 శాతానికి పైగా కంటెంట్‌ను ముందుగానే గుర్తించినట్లు తెలిపింది. ప్రకటనలను సమీక్షించేందుకు కొత్త ఏఐ ఆధారిత వ్యవస్థలను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.