గాంధీ, నెహ్రూ, యాదవ్‌ల నాయకత్వం మాకొద్దు: అసదుద్దీన్ ఒవైసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాంధీ, నెహ్రూ, యాదవ్‌ల నాయకత్వం మాకొద్దు: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Says No To Gandhi Nehru And Yadav Leadership
  • ముస్లింలు ఎవరికీ బానిసలు కాదన్న ఒవైసీ
  • ఓటు బ్యాంకుగా ముస్లింలు మిగిలిపోవద్దని వ్యాఖ్య
  • సొంత నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపు
ముస్లిం సమాజానికి ఇకపై గాంధీ, నెహ్రూ లేదా యాదవ్ కుటుంబాల నాయకత్వం అవసరం లేదని, సమాజంలో నుంచే సొంతంగా నాయకులు ఎదగాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఎవరికీ బానిసలు కాదని, సంప్రదాయ పార్టీలను అనుసరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కొంతమంది ఇప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని సలహా ఇస్తున్నారని, వారిలో నెహ్రూ లేదా గాంధీ వంటి వారు పుట్టుకొస్తారని ఆశిస్తున్నారని ఒవైసీ విమర్శించారు. "ఇతరులకు మద్దతివ్వమని వారు చెబుతారు, కానీ మీరే నాయకులుగా మారాలని నేను చెబుతున్నాను. ఇదే వారికి, ఒవైసీకి ఉన్న తేడా" అని ఆయన అన్నారు. ఇతర వర్గాలతో సమానంగా ప్రతిభ, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం యువతను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని, వారికి సరైన రాజకీయ వేదికను కల్పించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముస్లిం యువత, అణగారిన వర్గాల గొంతుకను వినిపించేందుకు, వారికి రాజకీయ వేదికను అందించేందుకే ఎంఐఎం పార్టీ పనిచేస్తోందని ఒవైసీ తెలిపారు. యువత ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా, స్వతంత్రంగా తమ నాయకత్వాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Asaduddin Owaisi
AIMIM
Muslim leadership India
Rampur UP rally
Gandhi Nehru Yadav politics
UP political news

More Telugu News