అలా ప్రాణాలతో బయటపడ్డ హీరో టైగర్ ష్రాఫ్!
- ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కలకలం
- ఫుట్‌బాల్ సెషన్ ముగించుకుని వస్తుండగా దాడి
- పాయింట్ బ్లాంక్‌లో మొరాయించిన దుండగుడి పిస్టల్
ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి జుహూ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో దుండగుడి చేతిలోని పిస్టల్ మొరాయించడంతోనే పెను ప్రమాదం తప్పిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. జుహూలోని పుష్పా పార్క్ సమీపంలో టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ సెషన్ ముగించుకుని కారులో బయలుదేరారు. అప్పటికే అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు వేచి చూసిన ముగ్గురు దుండగులు, రాత్రి 7 గంటల సమయంలో ఆయన కారును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఏడు రౌండ్లు కాల్పులు జరపగా, ఐదు బుల్లెట్లు కారుకు తగిలాయి. మిగతా రెండు గుళ్లు గురి తప్పాయి.
దాడి సమయంలో ఒక షూటర్ కారు కిటికీ వద్దకు వచ్చి, దగ్గరి నుంచి టైగర్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే, రెండుసార్లు ప్రయత్నించినా అతని చేతిలోని నాటు తుపాకీ మొరాయించింది. దీంతో బుల్లెట్ బయటకు రాలేదు.
ఆ సమయంలో దుండగుడు తుపాకీతో ఇబ్బంది పడుతున్న దృశ్యాలు వీడియో ఫుటేజ్‌లో కనిపించాయి. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ ఫిర్దాస్ ఎడమ చేతికి బుల్లెట్ గాయమైంది. సమీపంలో ఉన్న మరో వ్యక్తి కూడా గాయపడినట్లు తెలిసింది.
దాడి అనంతరం నిందితులు మోటార్‌సైకిల్‌పై అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వైపు పారిపోయారు. అక్కడ తమ వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుల పేరుతో ఒక సోషల్ మీడియా సందేశం వైరల్ కావడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితుల కోసం గాలిస్తున్నారు.