నవంబర్ రెండో వారంలో అందరం కలుద్దాం... గెట్ రెడీ!: విజయసాయిరెడ్డి
- ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య సివిల్ వార్ నడుస్తోందన్న విజయసాయిరెడ్డి
- పుంగనూరు, తాడిపత్రి ఘటనలను ప్రస్తావిస్తూ రెండు కుటుంబాలపై ఫైర్
- 'రెడ్ బుక్ వర్సెస్ రప్ప రప్ప' అంటూ రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఆందోళన
- రెండు పార్టీలకు గుణపాఠం చెప్పే మూడో ప్రత్యామ్నాయం రావాలన్న విజయసాయి
- నవంబర్ రెండో వారంలో కలుద్దామని, జెన్-జీ సిద్ధంగా ఉండాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల మధ్య పౌర యుద్ధం (సివిల్ వార్) నడుస్తోందని, రెండు కుటుంబాలు పోషిస్తున్న ఫ్యాక్షన్ల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
గత రెండు రోజులుగా పుంగనూరు, రాయచోటి, తాడిపత్రి, ఆళ్లగడ్డ వంటి పట్టణాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను విజయసాయిరెడ్డి తన పోస్టులో ప్రస్తావించారు. "రెడ్ బుక్ వర్సెస్ రప్ప రప్ప రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు, జగన్ కుటుంబాల మధ్య, ఆ రెండు కుల, మైనారిటీ కుటుంబాలు పోషిస్తున్న ఫ్యాక్షన్ల మధ్య ఓ సివిల్ వార్ నడుస్తోంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. కర్రలు, కత్తులు, గూండాలు, బౌన్సర్లు, నామినేషన్లు చించివేయడం, జీపులతో ఢీకొట్టడం, నెత్తురోడేలా దాడులు చేసుకోవడం వంటి దృశ్యాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువును తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే అరాచకం కొనసాగితే, 2029 నాటి సాధారణ ఎన్నికల్లో ఈ పార్టీలు నేరుగా బందిపోట్లకు, హత్యలు, మానభంగాలు, దొంగతనాల చరిత్ర ఉన్నవారికే టికెట్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ఒక మూడో ప్రత్యామ్నాయంతో సరికొత్త రాజకీయానికి యువత (జెన్-జీ) నడుం బిగించాలని పిలుపునిచ్చారు. "ఈ అరాచకం ఇకమీదటా కొనసాగాలా? లేక, ఈ రెండు పార్టీలకు గుణపాఠం నేర్పాలా? అన్నది నిర్ణయించుకోవాలి. నవంబర్ రెండో వారంలో అందరం కలుద్దాం... గెట్ రెడీ!" అంటూ తన పోస్టును ముగించారు.