యూపీలో యోగి హవా.. సర్వేలో స్పష్టమైన ఆధిక్యం.. విపక్షాలకు షాక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో యోగి హవా.. సర్వేలో స్పష్టమైన ఆధిక్యం.. విపక్షాలకు షాక్

Yogi Adityanath leads News18 UP mega survey for 2027 elections
  • యూపీ తదుపరి సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌కే ప్రజల మొగ్గు
  • యోగికి 66.2 శాతం, అఖిలేష్ యాదవ్‌కు 24.4 శాతం మద్దతని సర్వేలో వెల్లడి
  • యోగి ప్రభుత్వ పనితీరుపై 77 శాతం మందికి పైగా సంతృప్తి
  • శాంతిభద్రతలే కీలక ఎన్నికల అంశమని తెలిపిన ఓటర్లు
  • ఎన్డీఏకు 66.6 శాతం, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 26.4 శాతం ఓట్లని అంచనా
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని అంచనా వేస్తూ ‘న్యూస్18 యూపీ’ నిర్వహించిన మెగా సర్వేలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తిరుగులేని ఆధిక్యం లభించింది. తదుపరి ముఖ్యమంత్రిగా యోగీనే ఉండాలని సర్వేలో పాల్గొన్న వారిలో 66.2 శాతం మంది అభిప్రాయపడగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కేవలం 24.4 శాతం మద్దతు మాత్రమే లభించింది.

‘పీవాల్యూ అనలిటిక్స్‌’తో కలిసి ‘న్యూస్18’ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా యూపీలోని 75 జిల్లాల్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2026 మధ్య 30,925 మంది అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి 5 శాతం, చంద్రశేఖర్ ఆజాద్‌కు 1.8 శాతం మంది మద్దతు తెలిపారు.

యోగి ప్రభుత్వ పనితీరుపై ఏకంగా 77.1 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. వీరిలో 52.8 శాతం చాలా సంతృప్తిగా, 24.3 శాతం కొంతమేర సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. శాంతిభద్రతల విషయంలో 74 శాతం, మౌలిక సదుపాయాలపై 68.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వ పనితీరు బలహీనంగా ఉందని సర్వే సూచించింది. అయినప్పటికీ, 58.3 శాతం మంది ఉపాధి విషయంలో సంతృప్తిగానే ఉన్నామని తెలిపారు.

ఓటింగ్ విషయానికొస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 66.6 శాతం మంది ఓటేస్తామని చెప్పగా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 26.4 శాతం మద్దతు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే అత్యంత కీలకమైన ఎన్నికల అంశమని 33.4 శాతం మంది పేర్కొన్నారు. యోగికి కేవలం బీజేపీ మద్దతుదారులే కాకుండా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి మద్దతుదారుల్లో 11.7 శాతం మంది, బీఎస్పీ మద్దతుదారుల్లో 10.2 శాతం మంది కూడా తదుపరి సీఎంగా ఆయన వైపు మొగ్గు చూపడం విశేషం. 
Advertisement
Yogi Adityanath
Uttar Pradesh Assembly Elections 2027
News18 UP Mega Survey
Akhilesh Yadav
BJP NDA Alliance
UP Law and Order

More Telugu News