Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ తాటాకు చప్పుళ్లకు భయపడం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy says we are not afraid of Rahul Gandhis empty threats
Advertisement
  • కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపణ
  • పది నెలల్లో మోదీ సర్కార్ పడిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ
  • 2029 వరకు మోదీ ప్రధానిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్య
Advertisement
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలను ఆయన "తాటాకు చప్పుళ్లు"గా అభివర్ణించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, దేశంలో అరాచకాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని విపక్షాలు పగటి కలలు కంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. "పది నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోతుంది" అంటూ కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ఇది ప్రజాతీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు.

"ప్రధానిగా నరేంద్ర మోదీ 2029 వరకు కొనసాగాలని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. అయితే, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రభుత్వాలను మార్చినట్లుగా ఇక్కడ కూడా చేయాలని ప్రతిపక్షాలు దింపుడుకల్లం ఆశలతో ఉన్నాయి. వారి ఆశలు ఎప్పటికీ నెరవేరవు" అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ, ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం స్థిరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసే తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం భయపడదని, తమ ప్రభుత్వం అత్యంత స్థిరంగా ఉందని, పూర్తికాలం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
G Kishan Reddy
Rahul Gandhi
BJP Telangana
NDA Government
Narendra Modi
Indian Politics

More Telugu News