Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గడ్డంతో న్యూ లుక్.. అసలు కారణం చెప్పిన కేటీఆర్

KTR reveals the real reason behind his new beard look
Advertisement
  • కొత్త గడ్డం లుక్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేటీఆర్
  • రామగుండం పర్యటన నేపథ్యంలోనే ఈ మార్పు అని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేటీఆర్ ఫొటోలు, వీడియోలు
  • కేటీఆర్ లుక్‌ను 'మాస్' అంటూ ప్రశంసిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • 'ఆ మాత్రం ఉండాలి' అంటూ గడ్డంపై కేటీఆర్ సరదా వ్యాఖ్య
Advertisement
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే ఆయన, ఈసారి గడ్డంతో దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు దీనిని ‘మాస్ లుక్’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

నిన్న‌ రామగుండంలో నిర్వ‌హించిన‌ ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో పాల్గొనేందుకు కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన‌ సమయంలో ఆయన గడ్డంతో కనిపించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం పర్యటన మార్గమధ్యంలో కరీంనగర్ వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సతీశ్ బాబు వంటి నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తన గడ్డం వెనుక ఉన్న కారణాన్ని కేటీఆర్ సరదాగా వెల్లడించారు.

‘ఏందీ సంగతి.. గడ్డం పెంచినవ్?’ అని గంగుల కమలాకర్ అడగ్గా, కేటీఆర్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. "పోయేది గోదావరిఖనికే కదా.. సింగరేణికే కదా! ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడవదు" అంటూ చమత్కరించారు. సింగరేణి ప్రాంత పర్యటనకు వెళ్తున్నందునే ఈ రకంగా సిద్ధమయ్యానని ఆయన చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

కేటీఆర్ కొత్త లుక్ పట్ల ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆయన ఫొటోలను షేర్ చేస్తూ ‘బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ మాస్ లుక్’ వంటి కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ ఆహార్యం విషయంలో పెద్దగా మార్పులు చేయరు. అయితే, కేటీఆర్ తన లుక్‌ను మార్చడం, దానికి సింగరేణి ప్రాంతాన్ని ముడిపెడుతూ సరదాగా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Advertisement
KTR
KTR new look
Singareni Karmika Garjana
BRS Party
KTR beard look
Telangana politics

More Telugu News