Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ్ఞానేశ్ కుమార్‌కు ఏమైనా రహస్యాలు తెలుసా? అందుకే కాపాడుతున్నారా?: సీజేపీ నేత సౌరవ్ దాస్

Gyanesh Kumar Does He Know Any Secrets Asks CJP Leader Sourav Das
Advertisement
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
  • నిరసనలను అణిచివేసేందుకు నక్సల్, సరిహద్దు ప్రాంతాల నుంచి భద్రతా బలగాల తరలింపు
  • ఢిల్లీని కంటోన్మెంట్‌గా మార్చేశారని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆరోపణ
  • సామాన్యులను ఇబ్బంది పెట్టి ఉద్యమంపై వ్యతిరేకత సృష్టించేందుకు ప్రభుత్వ కుట్ర
  • ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని సుప్రీంకోర్టు ఆదేశించడంపై సీజేపీ హర్షం
Advertisement
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సీజేపీ చేపట్టిన నిరసనలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు దారితీశాయి. ఈ నిరసనలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నక్సల్ ప్రభావిత, సరిహద్దు ప్రాంతాల నుంచి భద్రతా దళాలను ఢిల్లీకి తరలించిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆదివారం ఆరోపించింది. ఢిల్లీని ఓ కంటోన్మెంట్‌గా మార్చేశారని తీవ్రంగా విమర్శించింది.

నివారణ అరెస్టు తర్వాత కోర్టు నుంచి విడుదలైన సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. "ఒక్క వ్యక్తిని కాపాడేందుకు దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను ఎందుకు కాపాడుతున్నారు? 2024 ఎన్నికలకు సంబంధించి లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తీరుపై ఆయనకు ఏమైనా రహస్యాలు తెలుసా?" అని సౌరవ్ దాస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సీఈసీ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఈ నిరసనల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

 "గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరాన్ని మొత్తం ఓ కంటోన్మెంట్‌గా మార్చేశారు. నిరసనలను అడ్డుకునేందుకు నక్సల్ ప్రాంతాలు, బెంగాల్, కశ్మీర్ నుంచి ప్రత్యేక దళాలను, సరిహద్దుల నుంచి బీఎస్ఎఫ్ సిబ్బందిని విమానాల్లో తరలించారు. దాదాపు 30,000 నుంచి 40,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు" అని ఆరోపించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సౌరవ్ దాస్ అన్నారు. "ఆందోళనకారులపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. మెట్రో స్టేషన్లు మూసివేయడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేయడం, దుకాణాలను బలవంతంగా మూయించడం వంటి చర్యలతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. కానీ, ప్రభుత్వం పొరబడుతోంది. యువతపై జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని దేశమంతా గమనిస్తోంది" అని పేర్కొన్నారు. తమను అరెస్టు చేసే సమయంలో ఢిల్లీ పోలీసులు ఎలాంటి అధికారిక నోటీసులు ఇవ్వలేదని, ఫోన్లను స్వాధీనం చేసుకుని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు హ్యాక్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో మెట్రో, రైల్వే సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని, ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించడాన్ని సీజేపీ న్యాయ వ్యవహారాల అధిపతి రత్న సింగ్ స్వాగతించారు. అయితే, కోర్టు ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయో చూడాలని ఆమె అన్నారు.
Advertisement
Advertisement
Gyanesh Kumar
Sourav Das
Cockroach Janata Party
Delhi Protests
Chief Election Commissioner
Security Forces Deployment

More Telugu News