‘క్రేజీ కళ్యాణం’.. పెళ్లికూతురి మనసులో మాట ఇదే!

Entertainment
Advertisement
  • నరేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో ‘క్రేజీ కళ్యాణం’
  • దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్న సినిమా
  • చదువు మధ్యలో పెళ్లి చేసుకునే అమ్మాయిల కథతో చిత్రం
  • తెలంగాణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడి వెల్లడి
సీనియర్ నటుడు వీకే నరేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం క్రేజీ కల్యాణం విడుదలకు సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తుండగా,  వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దేమరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే, అదే సమయంలో విడుదల కావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా వాయిదా పడటంతో థియేటర్ల లభ్యత పెరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ‘క్రేజీ కళ్యాణం’ విడుదలను రెండు వారాలు ముందుకు జరిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తికాగా, ఒక ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు బద్రప్ప గాజుల మాట్లాడుతూ "ఇది హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో కూడిన ఒక సంపూర్ణ కుటుంబ కథా చిత్రం. కథ తెలంగాణ నేపథ్యంలో సాగినా, సంభాషణలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి" అని తెలిపారు. సినిమా కథాంశం గురించి ఆయన వివరిస్తూ, "చదువుకునే రోజుల్లో నా స్నేహితులతో కలిసి క్లాస్‌మేట్స్ పెళ్లిళ్లకు వెళ్లేవాడిని. సమాజం, గౌరవం పేరుతో అమ్మాయిలకు చదువు మధ్యలోనే పెళ్లిళ్లు చేసేవారు. కానీ అబ్బాయిలు మాత్రం చదువు కొనసాగించేవారు. అలా పెళ్లి పీటల మీద కూర్చున్న ఒక యువతి ఆలోచనలు, నెరవేరని కలల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సామాజిక ఆచారంలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కించాం" అని పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

మళ్లీ యాక్షన్ హీరోగా శరత్‌కుమార్.. 177వ చిత్రానికి 'టాక్సీ' టైటిల్

25 Nov, 06:28

మళ్లీ ఐపీఎల్‌లోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్... కనీస ధర రూ. 2 కోట్లు

25 Nov, 06:26

పంది కిడ్నీతో ఏడాది పాటు జీవించిన అమెరికా మహిళ: జంతు అవయవ మార్పిడిలో కొత్త రికార్డు

25 Nov, 06:22

తిరుమల యాత్రికులకు టీటీడీ 'శ్రీవారి యాత్ర సురక్ష' బీమా పథకం

25 Nov, 06:19

తిరుపరంకుండ్రం కొండపై వెలిగిన కార్తిక మహాదీపం.. సుప్రీంకోర్టు ఆదేశాల వేళ వివాదం!

24 Nov, 23:19

బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరల్లో భారీ పతనం.. అమెరికా ఫెడ్ ఎఫెక్ట్

24 Nov, 23:08

నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది: చిరంజీవి

24 Nov, 23:06

బంగారం ధర తగ్గుదలతో పెరిగిన అమ్మకాలు.. నగల వ్యాపారుల్లో మాత్రం ఆందోళన!

24 Nov, 22:58

ఉసేన్ బోల్ట్ అవాక్కయ్యేలా.. 100 మీటర్లను 10.35 సెకన్లలో పరిగెత్తిన ఐషోస్పీడ్.. వీడియో ఇదిగో!

24 Nov, 22:49

సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. గాలింపు చర్యలను ముమ్మరం చేయండి: సీఎం చంద్రబాబు ఆదేశం

24 Nov, 22:33

ఈ స్కాలర్‌షిప్ తో ఏటా రూ.1.25 లక్షలు.. అర్హులో కాదో చెక్ చేసుకోండి!

24 Nov, 22:27

మార్కెట్‌లో ఆ బ్యాచ్ వాటర్ బాటిళ్లు లేవు: బిస్లరీ యాజమాన్యం వివరణ

24 Nov, 22:18

నాగార్జున 'కింగ్ 100' రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ ఇదిగో!

24 Nov, 22:12

ఏపీలో మామిడి రైతులు ప్రభుత్వ బీమా ఎలా పొందాలో తెలుసా?

24 Nov, 22:05

ఒకట్రెండు బంతులు ఆడాక పిచ్ ఎలా ఉందో అర్థమైపోయింది.. దాంతో నా బలాన్ని నమ్ముకున్నాను: వైభవ్ సూర్యవంశీ

24 Nov, 21:57
..More Telugu News