Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరువు తగ్గాలని భోజనం మానేస్తున్నారా? బెడిసికొట్టే ప్రమాదం ఉందంటున్న నిపుణులు!

Weight loss skipping meals to lose weight experts warn of dangerous consequences
Advertisement
  • భోజనం మానేస్తే బరువు తగ్గుతారని అనుకోవద్దంటున్న నిపుణులు
  • తర్వాతి భోజనంలో అతిగా తినే అవకాశం ఉందని హెచ్చరిక
  • భోజనం మానేస్తే శరీరానికి సరిపడా పోషకాలు అందకపోవచ్చని వెల్లడి
  • అన్నం, చపాతీల సహా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తినే అవకాశం ఉందని హెచ్చరిక
  • దీని వల్ల బరువు తగ్గకపోగా.. పెరిగే ప్రమాదం ఉందని వెల్లడి
Advertisement
బరువు తగ్గాలని చాలామంది భోజనం మానేస్తుంటారు. మరికొందరు పనుల ఒత్తిడితో మధ్యాహ్నం సరిగ్గా తినలేక కాఫీతో సరిపెట్టుకుంటారు. ఇలా చేస్తే కేలరీలు తగ్గి బరువు తగ్గుతామని అనుకుంటారు. కానీ ఈ అలవాటు వల్ల తర్వాత మరింత ఎక్కువగా తినే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పనులు, మీటింగ్‌లతో బిజీగా ఉండి భోజనానికి సమయం కేటాయించలేని వారు చాలా మందే ఉంటారు. భోజనం మానేస్తే శరీరానికి అందాల్సిన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు అందకుండా పోతాయి. దీనివల్ల పోషకాలు తగినంతగా అందకపోవచ్చు. అంతేకాకుండా, తర్వాతి భోజనం చేసే సమయానికి విపరీతమైన ఆకలి వేయొచ్చు. అప్పుడు ఏది తింటున్నాం? అందులో పోషకాలు సరిపడా ఉన్నాయా? అని ఆలోచించకుండా కడుపు నింపే ఆహారం వైపు మొగ్గు చూపుతాం.

ముఖ్యంగా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం, చపాతీలు, పాస్తా, నూడుల్స్‌ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అవసరానికి మించి తినే అవకాశం ఉంది. ఇలా తరచూ జరిగితే బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉంది. 

ముందుగానే ప్లాన్‌ చేసుకోండి
రోజంతా బిజీగా ఉన్నా భోజనాన్ని ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. ఇందుకోసం కేవలం 10 నిమిషాలు కేటాయించినా సరిపోతుంది. ప్రతి భోజనంలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి.

వండటానికి సమయం లేని రోజుల్లో త్వరగా తినగలిగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. అలా చేస్తే ఆకలి వేసినప్పుడు ఏది పడితే అది తినకుండా ఉండొచ్చు. భోజనం ఎప్పుడూ ప్రత్యేకంగా, ఎక్కువ సమయం తీసుకునేలా ఉండాల్సిన అవసరం లేదు. పనుల హడావుడిలో కాఫీతో సరిపెట్టి, రాత్రి అతిగా తినే పరిస్థితి రాకుండా చూసుకోవడమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Weight loss
Skipping meals
Nutrition experts
Healthy diet
Overeating
Meal planning

More Telugu News