Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఘటన నన్ను బాధించింది: గంగూలీపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri sensational comments on Sourav Ganguly regarding coach selection incident
Advertisement
  • కోచ్ ఎంపిక వివాదంపై తొలిసారిగా మౌనం వీడిన రవిశాస్త్రి
  • 2016లో తన ఇంటర్వ్యూకు గంగూలీ హాజరుకాకపోవడంపై అసంతృప్తి
  • తనను కాదని కుంబ్లేను ఎంపిక చేయడం తీవ్రంగా బాధించిందని వ్యాఖ్య
  • జీవితంలో ఒడుదొడుకులు సహజమని, తర్వాత అవకాశం దక్కించుకున్నానని వెల్లడి
Advertisement
టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ మధ్య ఉన్న పాత వివాదంపై రవిశాస్త్రి తొలిసారి మౌనం వీడాడు. 2016లో భారత జట్టు ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా తనను ఇంటర్వ్యూ చేయాల్సిన కమిటీలో ఉన్న గంగూలీ హాజరుకాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది తనను అగౌరవపరిచినట్లు అనిపించిందని వెల్లడించాడు.

2014లో టీమిండియా 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. అతడి పదవీకాలం ముగిసిన అనంతరం, 2016లో బీసీసీఐ ఆ పదవిని రద్దు చేసి, ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. రవిశాస్త్రిని కూడా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా మండలి (సీఏసీ) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే, రవిశాస్త్రి ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ గైర్హాజరయ్యాడు. చివరికి, సీఏసీ రవిశాస్త్రిని కాదని అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది.

ఈ పరిణామాలపై రవిశాస్త్రి స్పందిస్తూ, "జట్టు కోసం నేను శాయశక్తులా కృషి చేశాను. అటువంటి తరుణంలో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి గంగూలీ రాకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది" అని పేర్కొన్నాడు. "నేను డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బోర్డు సభ్యులు వచ్చి ఆ పదవిని రద్దు చేస్తున్నామని చెప్పారు. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోమని సూచించారు. నన్ను కావాలనే బయటకు పంపించేందుకు కారణాల కోసం వెతికారనిపించింది. ఆ నిర్ణయం నన్ను ఎంతగానో కలచివేసింది" అని వ్యాఖ్యానించాడు.

అయితే, ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు తిరిగి కామెంటేటర్‌గా పనిచేసిన రవిశాస్త్రి, అనంతరం మళ్లీ ప్రధాన కోచ్‌గా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టాడు. "జీవితంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజం. వాటన్నింటినీ ఎదుర్కొని నేను ముందుకు సాగాను. ఆ విరామంలో నా కోచింగ్ నైపుణ్యాలు మరింత మెరుగుపుర్చుకున్నాను. చివరకు నాకు దక్కాల్సిన అవకాశం మళ్లీ దక్కింది" అని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
Advertisement
Advertisement
Ravi Shastri
Sourav Ganguly
Indian Cricket Team Coach
BCCI Coach Selection 2016
Ravi Shastri Ganguly Controversy

More Telugu News