హైదరాబాద్‌లో ఇండియా కూటమి ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీలో ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్ట్‌

Telangana
Advertisement
  • హైదరాబాద్‌లో ఇండియా కూటమి ‘చలో లోక్‌భవన్‌’ ర్యాలీ.
  • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌.
  • లోక్‌భవన్‌ వద్ద పోలీసుల బారికేడ్లు
  • పోలీసులతో నేతలకు తీవ్ర వాగ్వాదం
  • పొన్నం, మహేశ్‌ గౌడ్‌ సహా నేతల అరెస్ట్‌
‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఇండీ కూటమి హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఛలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్‌ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

లోక్‌భవన్‌ వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కూటమి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డీసీఎంలో తరలించారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఇండియా కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ‘సేవ్‌ డెమోక్రసీ’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు చేపట్టాలని కూటమి గతంలో కార్యాచరణ రూపొందించింది.

మరోవైపు ఢిల్లీలోనూ ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో కూటమి నేతలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో మరో నిరసన చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
Advertisement

సంబంధిత వార్తలు

INDIA AllianceSave Democracy Rally HyderabadPonnam PrabhakarMahesh Kumar GoudAsaduddin OwaisiCEC Gyanesh Kumar Resignation

More Telugu News

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40

కొణిదెల సురేఖ వద్ద రూ.5 వేలు అప్పు తీసుకున్న బన్నీ వాసు.. ఇప్పటికీ తీర్చలేదట!

22 Nov, 22:28
..More Telugu News