Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ యాత్రపై ప్రధాని ప్రశంసలు.. కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh thanks PM Narendra Modi for praising TDP Seva Sankalp Yatra
Advertisement
  • ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్
  • తిరుపతి నుంచి కాశీకి కృష్ణా, గోదావరి జలాలతో బైక్ యాత్ర
  • ప్రభుత్వాధినేతగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ 'సేవా సంకల్ప యాత్ర' 
  • మీ మాటలు కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్న లోకేశ్
Advertisement
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన 'సేవా సంకల్ప యాత్ర'ను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని అందించిన ప్రోత్సాహకర వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ తన పోస్టులో.. "ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారూ. గత 25 ఏళ్లుగా మీరు అందిస్తున్న నిరంతర సేవలు, సుపరిపాలనకు నివాళిగా ఈ యాత్రను ఒక చిన్న కానుకగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీ క్షేత్రానికి తీసుకెళ్లడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఇది మన ప్రజలు, సంప్రదాయాలు, దేశాన్ని ఏకం చేసే బంధాలను చాటిచెబుతోంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న ప్రతి కార్యకర్తకు మీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి" అని వివరించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేత బాధ్యతల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ ఈ 'సేవా సంకల్ప యాత్ర'ను నిర్వహించింది. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులు తిరుపతి నుంచి కాశీ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల మేర బైక్ యాత్రను చేపట్టాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను సేకరించి, కాశీ విశ్వనాథునికి జలాభిషేకం నిర్వహించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.

అంతకుముందు ఈ యాత్రపై ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. ఏపీ నుంచి నదీ జలాలను సేకరించి తీసుకురావడం తనను ఎంతో కదిలించిందని పేర్కొన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసిన టీడీపీ నేతలను, కార్యకర్తలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Narendra Modi
TDP Seva Sankalp Yatra
Tirupati to Kashi bike rally
Telugu Desam Party
Andhra Pradesh politics

More Telugu News