Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైరాం.. మీరింత తొందరపడతారని నేను అనుకోలేదు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman says Jairam I did not think you would be in such a hurry
Advertisement
  • జైరాం రమేశ్ పోస్టుపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం
  • ఏపీ సభలో కనిపించింది ప్రజల ఉత్సాహమేనని స్పష్టీకరణ
  • అది ప్రజాగ్రహమంటూ జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
  • కాంగ్రెస్ నేతపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర అభ్యంతరం
  • అన్నమయ్య జిల్లా సభ ఘటనపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం
Advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. "జైరాం, నమ్మలేకపోతున్నాను. మీరింత తొందరపడతారని నేను అనుకోలేదు. అక్కడ ఉన్నది టీడీపీ, జనసేన కార్యకర్తలు. తమ నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో మాట్లాడాలని వారు ఉత్సాహం చూపారు. కార్యక్రమం తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారని గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పారు. అక్కడ జరిగింది అంతే" అని ఆమె తన పోస్టులో ఘాటుగా బదులిచ్చారు. ఓ చిన్న విషయాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా, సభకు హాజరైన కొందరు యువకులు తమ నాయకులను చూడాలనే ఉత్సాహంతో కేకలు వేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకుని, కార్యక్రమం ముగిశాక నాయకులు అందరితో మాట్లాడతారని చెప్పి వారిని శాంతపరిచారు.

అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సులేమాన్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'మొదట ఉద్యోగాలు ఇవ్వండి' అంటూ సభలోని వారు నినాదాలు చేశారని తప్పుడు సమాచారాన్ని జతచేశారు. ఈ పోస్టును జైరాం రమేశ్ రీపోస్ట్ చేస్తూ, "ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ఆర్థిక మంత్రి స్వయంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రజలను నిశ్శబ్దంగా మార్చాల్సి వచ్చింది" అని వ్యాఖ్యానించారు.

జైరాం రమేశ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎవరో పెట్టిన తప్పుడు పోస్టు ఆధారంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. సభలో కనిపించింది ప్రజాగ్రహం కాదని, తమ నాయకుల పట్ల ప్రజలు, కార్యకర్తలు చూపిన ఉత్సాహం అని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఏపీలోని ఓ కార్యక్రమం చుట్టూ జాతీయ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ మాటల యుద్ధం రాజుకుంది.
Advertisement
Advertisement
Nirmala Sitharaman
Jairam Ramesh
Chandrababu Naidu
Madanapalle Horticulture Hub
Andhra Pradesh Politics
TDP Janasena workers

More Telugu News