Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాల్లోనే ఢీకొట్టిన పక్షి.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

IndiGo flight 6E352 survives bird strike at Shamshabad Airport
Advertisement
  • పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బర్డ్ హిట్
  • పైలట్ చాకచక్యంతో శంషాబాద్‌లో సురక్షిత ల్యాండింగ్
  • విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తింపు
Advertisement
పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఒక పక్షి బలంగా ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన '6ఈ352' విమానం పుణె నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించారు.

ల్యాండింగ్ అనంతరం నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తించారు. పక్షి ఢీకొనడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

మరోవైపు, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా చండీగఢ్ వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
Advertisement
Advertisement
IndiGo
Bird hit
Shamshabad Airport
Pune to Hyderabad flight
Emergency landing
Indigo flight 6E352

More Telugu News