Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Indrakeeladri Dasara Celebrations CM Chandrababu Naidu Invited
Advertisement
  • అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ఉత్సవాలు
  • క్యాంపు కార్యాలయంలో ఆహ్వానపత్రిక అందజేత
  • సీఎంకు అమ్మవారి ప్రసాదం, వేదాశీర్వచనం
  • ఉత్సవాల ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
  • భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
Advertisement
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందించి, వేదాశీర్వచనం పలికారు.

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై చంద్రబాబు ఆరా తీశారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఆలయ ఈవో శీనా నాయక్‌, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
Indrakeeladri Dasara 2024
Vijayawada Kanaka Durga Temple
AP CM Dasara Invitation
Vijayawada Durga Temple Board
Indrakeeladri Dasara Schedule

More Telugu News