Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బొగ్గు కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేటీఆర్

KTR slams Telangana government decision on coal purchase
Advertisement
  • ఇది మరో తుగ్లక్ నిర్ణయమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ
  • చౌకగా లభించే సింగరేణి బొగ్గును కాదని విదేశీ బొగ్గు కొంటున్నారని ఆరోపణ
  • టన్నుకు రూ. 3,800 బదులు రూ.9,000 చెల్లిస్తున్నారని ఆగ్రహం
  • ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయమంటూ ఎక్స్‌లో కేటీఆర్ ప్రశ్న
Advertisement
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం బొగ్గు కొనుగోలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వపు మరో 'తుగ్లక్ నిర్ణయం'గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' ద్వారా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.

చౌకగా లభించే సింగరేణి బొగ్గును పక్కనపెట్టి, భారీ ధర వెచ్చించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి బొగ్గు టన్నుకు సుమారు రూ.3,800కే అందుబాటులో ఉండగా, విదేశాల నుంచి దాదాపు రూ.9,000 వెచ్చించి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని, ఈ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నాయనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో సింగరేణి సంస్థ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సైతం బొగ్గును సరఫరా చేసిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి బొగ్గుతోనే టీఎస్ జెన్‌కో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరాను అందించిందని వివరించారు. రాష్ట్రంలోనే పుష్కలమైన వనరులు ఉండగా, వాటిని కాదని అధిక ధర చెల్లించి దిగుమతి చేసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
Advertisement
Advertisement
KTR
Singareni Coal
Telangana Congress Government
Coal Import Decision
Telangana Power Generation

More Telugu News