నాతో పెట్టుకుంటే ఆధారాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Telangana
Advertisement
  • కేటీఆర్‌ వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ చీఫ్‌ కవిత ఆగ్రహం
  • కేసీఆర్‌పై పార్టీ వైఫల్యాలు నెడుతున్నారంటూ విమర్శలు
  • కేటీఆర్‌ తీరు పార్టీ వ్యతిరేకం కాదా అంటూ నిలదీత
  • ఫామ్‌హౌస్‌లు, క్విడ్‌ ప్రో కోపై ఆరోపణలు
  • రైతు, మహిళ పట్ల వ్యాఖ్యలపై కేటీఆర్‌పై విమర్శలు
బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్‌ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలను, చేతగానితనాన్ని కేసీఆర్‌పై నెట్టడం ఏంటని ప్రశ్నించారు. గుంటనక్క మైండ్‌గేమ్‌లో పడి పార్టీ అధినేతనే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. తనతో పెట్టుకోవద్దని, నిర్దిష్టమైన ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు.

నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్‌ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కవిత ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు పార్టీ వైఫల్యాలను కేసీఆర్‌పై మోపుతున్నారని విమర్శించారు. ఇలా చేస్తూ బీఆర్ఎస్‌కు గోతులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఓ అవినీతి వ్యక్తిని విమర్శిస్తే కొన్ని గంటల్లోనే సస్పెండ్‌ చేశారని కవిత పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు అదే వ్యక్తితో కలిసి ఉంటూ, కేసీఆర్‌ తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని బహిరంగంగా వ్యాఖ్యానించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. పార్టీ అధినేతను, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బహిరంగంగా తప్పుబట్టడం ఏంటని నిలదీశారు.

ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన అనుమతులు, ఆంధ్రా స్నేహితులకు ఇచ్చిన ప్రయోజనాలు, క్విడ్‌ ప్రో కో వ్యవహారాలతో బీఆర్ఎస్‌ను పాతాళంలోకి నెట్టింది మీరే అంటూ కేటీఆర్‌పై కవిత ఆరోపణలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్‌ సమావేశంలో ఓ రైతు ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆయన భార్యను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సాయం కోరుతూ వచ్చిన మహిళతోనూ అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు.

గణేశ్‌ నిమజ్జనోత్సవంలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంతమందిని బతిమాలుకున్నారో గణేశుడికి, వారి అంతరాత్మకు తెలుసని కవిత వ్యాఖ్యానించారు. తాను విషనాగుల మాటలు విని మాట్లాడనని, నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడతానని స్పష్టం చేశారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరిక జారీ చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

KavithaKTRK Chandrashekar RaoBRS PartyTelangana PoliticsKavitha vs KTR

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News