బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana
Advertisement
  • బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు అసభ్యంగా ప్రవర్తించారనడానికి ఆధారాల్లేవన్న హైకోర్టు
  • బాధ్యులైన పోలీసులను గుర్తించాలని డీజీపీకి ఆదేశం
  • పోలీసులపై చర్యలకు నివేదిక సిద్ధం చేయాలని సూచన
  • నివేదికను స్పీకర్‌ ముందు ఉంచాలని ఆదేశం
  • స్పీకర్‌ ఆదేశాలైతే చర్యలు ఆయన పరిధిలోనే ఉంటాయన్న కోర్టు
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారన్న పోలీసుల వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది.

ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని హైకోర్టు సూచించింది. ఆ నివేదికను అసెంబ్లీ స్పీకర్‌ ముందు ఉంచాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు స్పీకర్‌ ఆదేశాల మేరకే వ్యవహరించి ఉంటే.. వారిపై చర్యలు తీసుకునే అంశం స్పీకర్‌ పరిధిలోకి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్‌కు ఉన్న అధికారాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా సవరించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశించింది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా గేటు వద్ద ఈ ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Advertisement

సంబంధిత వార్తలు

Telangana High CourtBRS Women MLAsDGP CV AnandTelangana Assembly ClashPolice Misconduct CaseAssembly Speaker Report

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News