Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యుత్ బిల్లులో ఈ-చలాన్లు.. వసూళ్లపై సుప్రీం కీలక సూచన

Supreme Court suggests collecting e challans through electricity bills
Advertisement
  • ట్రాఫిక్ చలాన్ల వసూలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • ఈ-చలాన్లను కరెంట్ బిల్లులో కలిపేయాలని సూచన
  • దేశవ్యాప్తంగా రూ.45 వేల కోట్ల చలాన్లు పెండింగ్
  • చలాన్లు కట్టనివారికి ఆర్సీ రెన్యువల్ నిలిపివేయాలని సలహా
Advertisement
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారుల నుంచి ఈ-చలాన్ల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పేరుకుపోయిన చలానాల మొత్తాన్ని వాహనదారుల విద్యుత్ బిల్లులకు జోడించి వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతుల ద్వారా వసూళ్లు చేయడం కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ భారీ బకాయిలపై జస్టిస్ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. "ఒకే మార్గంలో పయనిస్తామంటే ఈ దేశంలో సాధ్యం కాదు. ఈ-చలాన్ల మొత్తాన్ని విద్యుత్ బిల్లులతో అనుసంధానించండి" అని వ్యాఖ్యానించింది.

చలాన్లు చెల్లించని వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. అటువంటి వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) పునరుద్ధరణను నిలిపివేయడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. బకాయిల వసూలు కోసం అధికారులు వినూత్నమైన, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
Supreme Court of India
E challan collection
Traffic fine electricity bill
Justice Pardiwala
Pending traffic challans
Vehicle registration fitness

More Telugu News