ఆదివారం డ్యూటీ, సోమవారం షాక్.. సమ్మె వాయిదాపై వెల్లువెత్తిన మీమ్స్
- ఇవాళ్టి నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా
- బ్యాంక్ యూనియన్లు, ఐబీఏ మధ్య అర్ధరాత్రి చర్చలు విజయవంతం
- అన్ని శనివారాలు సెలవు డిమాండ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం
- సమ్మె వాయిదా పడటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ), 'ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్' (ఐబీఏ) మధ్య ఆదివారం అర్ధరాత్రి జరిగిన చర్చలు ఫలించడంతో యూనియన్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.
నిన్న రాత్రి సుమారు 9:30 గంటలకు యూఎఫ్‌బీయూ, ఐబీఏ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. ఈ చర్చల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం, బ్యాంకులకు మిగిలిన శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారులు సహా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది.
దీంతో పాటు గతంలో చర్చించిన ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో ప్రతిపాదిత సమ్మెతో పాటు ఇతర ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది.
ఈ సమ్మె ప్రకటన నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చాలా బ్యాంకు శాఖలు ఆదివారం కూడా తెరుచుకుని ప్రత్యేకంగా పనిచేశాయి. ఖాతాదారులు తమ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకున్నారు. అయితే, చివరి నిమిషంలో సమ్మె వాయిదా పడటంతో ఆదివారం పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు పూర్తి వారం విధులకు హాజరుకావాల్సి వస్తోంది.
ఈ అనూహ్య పరిణామంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. "ఆదివారం ఆఫీస్‌కు వెళ్లొచ్చాం, ఇప్పుడు సమ్మె లేదు" అంటూ ఉద్యోగుల పరిస్థితిపై నెటిజన్లు సరదాగా మీమ్స్, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, సమ్మె వాయిదా పడటంతో సాధారణ ప్రజలు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.