చిట్టీల పేరుతో మోసం.. రూ. 10 కోట్లతో పరారైన ప్రభుత్వ టీచర్

Telangana
Advertisement
  • సూర్యాపేట జిల్లాలో ఘటన
  • కుటుంబంలో కలిసి పరారు కావడంతో వెలుగులోకి
  • 12 గ్రామాల ప్రజలు, బంధువుల నుంచి భారీగా డబ్బు సేకరణ
  • పక్కా ప్లాన్‌తో భూములు అమ్మి, హైదరాబాద్‌లో డ్రామా ఆడి పరారీ
చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబం కలిసి పరారైన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన ఓ వ్యక్తి, ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నాడు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఆరేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన సొంత తండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బులు కట్టించుకున్నాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.30 కోట్ల వరకు వసూలు చేశాడు. కొందరికి ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వగా, మరికొందరికి నెలవారీగా అధిక లాభాలు ఇస్తానని నమ్మించాడు. ఇలా రూ.10 కోట్లకు పైగా సమీకరించాడు. అయితే, ఏడాదిగా డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి చేస్తుండటంతో వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే, పరారయ్యేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. తనకున్న 4 ఎకరాల భూమిలో ఎక్కువ భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి, తన పేరిట కేవలం 13 గుంటలు మాత్రమే ఉంచుకున్నాడు. సుమారు పది రోజుల క్రితం, హైదరాబాద్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలని చెప్పి ఇద్దరు గ్రామస్థులను తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో కూర్చుని తాను అప్పుల్లో కూరుకుపోయానని చెప్పి, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, సూర్యాపేట, తండాలోని అతడి ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆ డబ్బును ఏం చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Government TeacherSuryapet Chit Fund FraudTen Crore Scam TelanganaChivvemla Mandal TeacherTelangana Police InvestigationFinancial Fraud Case

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News