ఏపీ, కర్ణాటక పెద్దల ఆజ్ఞలను పాటిస్తూ ఇక్కడి నాణ్యమైన బొగ్గును ఆ రాష్ట్రాలకు తరలిస్తున్నారు: జగదీశ్ రెడ్డి

Telangana
Advertisement
  • విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసిందన్న జగదీశ్ రెడ్డి
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
  • విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, సాగు, తాగునీటితో పాటు విద్యుత్ రంగంలోనూ అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ డైవర్షన్ డ్రామాలు ఆడుతుంటారని దుయ్యబట్టారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల పెద్దల ఆజ్ఞలను పాటిస్తూ ఇక్కడి నాణ్యమైన బొగ్గును ఆ రాష్ట్రాలకు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. 


ఇక యాదాద్రి పవర్ ప్లాంట్‌పై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన యాష్ (బూడిద) అవసరాలను దృష్టిలో ఉంచుకునే దాన్ని దామరచర్లలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఎండిపోతున్న పొలాలు సీఎం రోజువారీ డ్రామాలతో పండవని, ఇప్పటికైనా అనవసరపు పనులు మాని పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు.


పాలిచ్చే ఆవులాంటి ట్రాన్స్‌కోను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఢిల్లీ, ముంబై, ఒడిశా వంటి ప్రాంతాల్లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించిన చోట ప్రజలపై విపరీతమైన భారం పడిందని అన్నారు. కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా నాటి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయలేదని, కానీ ప్రస్తుత సర్కార్ మాత్రం కమీషన్లకు ఆశపడి ట్రాన్స్‌కో లక్షల కోట్ల ఆస్తులను కారుచౌకగా అమ్మేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ట్రాన్స్‌కో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రశ్నించిన అధికారులపై ఏసీబీ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుసరించే ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతుందని హెచ్చరించారు.


నాటి సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణ చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చిందని కొనియాడారు. అసాధ్యమనుకున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను కొన్ని నెలల వ్యవధిలోనే అన్ని వర్గాలకు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. కేవలం ట్రాన్స్‌కోపైనే రూ.36 వేల కోట్లు వెచ్చించి, ఎక్కడ విద్యుత్ సరఫరా నిలిచినా మరో మార్గం ద్వారా అనుసంధానించే అధునాతన గ్రిడ్ వ్యవస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

Jagadish ReddyRevanth ReddySingareni CoalTelangana Power SectorBRS PartyTransco Privatization

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News