తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత

Telangana
Advertisement
  • టీజీటెట్‌ ఇన్‌-సర్వీస్‌-2026 ఫలితాలు విడుదల
  • 22,477 మందిలో 15,749 మంది అర్హత
  • పేపర్‌-1లో 68.76 శాతం మంది పాస్‌
  • గణితం, సైన్స్‌లో 73.60 శాతం ఉత్తీర్ణత
  • సోషల్‌ స్టడీస్‌లో 67 శాతం మంది అర్హత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌-ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను విడుదల చేశారు.

జులై 21న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించారు. మూడు విడతల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

పేపర్‌-1లో 4,942 మంది పరీక్షకు హాజరుకాగా.. 3,398 మంది (68.76%) అర్హత సాధించారు.

పేపర్‌-2 గణితం, సైన్స్‌ విభాగంలో 9,131 మంది పరీక్ష రాశారు. వీరిలో 6,720 మంది (73.60%) ఉత్తీర్ణులయ్యారు.

పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌లో 8,404 మంది పరీక్షకు హాజరుకాగా.. 5,631 మంది (67%) అర్హత సాధించారు.

అభ్యర్థులు తమ ఫలితాలతో పాటు మార్కుల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లోనూ మార్కుల వివరాలను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

TG TETTelangana TET Results 2024In Service Teachers TETTelangana School Education DepartmentTG TET Pass PercentageTeacher Eligibility Test

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News