Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దసరా బరిలో ‘రణబాలి’.. విడుదల తేదీపై క్లారిటీ

Ranabali in Dussehra race clarity on release date
Advertisement
  • విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రిలీజ్ డేట్ ఖరారు
  • దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • వాయిదా పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన చిత్రబృందం
  • ‘టాక్సీవాలా’ కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా
Advertisement
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు చిత్రబృందం తీపి కబురు అందించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వాయిదా పుకార్లకు స్వస్తి పలుకుతూ, ముందుగా వెల్లడించినట్లే అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

విజయదశమి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది.

19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో, 1854-1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ వీరతిలకం దిద్దుకుని ఆవేశంతో కనిపిస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘ఏందయ్య సామీ..’ పాట కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Advertisement
Advertisement
Vijay Deverakonda
Ranabali release date
Rahul Sankrityan
Rashmika Mandanna
Mythri Movie Makers
Ranabali Dussehra release

More Telugu News