ఏపీ పట్టణాలకు కొత్త కళ.. రూ.11,359 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం

Andhra
Advertisement
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పట్టణ అభివృద్ధి పనులకు శ్రీకారం
  • హెచ్ఏఎం పద్ధతిలో తొలిసారిగా 123 మున్సిపాలిటీల్లో పనుల ప్రారంభం
  • కుప్పం నుంచి లాంఛనంగా పనులను ప్రారంభించ‌నున్న‌ సీఎం చంద్రబాబు
  • సుమారు 2,165 కిలోమీటర్ల రోడ్లు, 502 పార్కుల నిర్మాణం లక్ష్యం
  • శాంతిపురం వద్ద హంద్రీనీవా కాలువకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానంలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి లాంఛనంగా ప్రారంభించ‌నున్నారు. 

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో పనులు మొదలు కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,469 కోట్లు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో ప్రత్యేకంగా రూ.3,890 కోట్ల విలువైన పనులను చేపట్టనున్నారు. 

ఈ నిధులతో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.4,656 కోట్లు, సెంట్రల్ మీడియన్ల ఏర్పాటుకు రూ.88 కోట్లు, కొత్త స్ట్రీట్ లైటింగ్ కోసం రూ.247 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.509 కోట్లు కేటాయించారు. 

ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,165 కిలోమీటర్ల రోడ్లు, 502 పార్కులు, 210 కిలోమీటర్ల సెంట్రల్ మీడియన్లు, 391 కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైటింగ్, 300 కిలోమీటర్ల సీవరేజ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి.

పట్టణ స్థానిక సంస్థలపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పనులను హెచ్ఏఎం పద్ధతిలో అమలు చేస్తోంది. ఈ విధానంలో కాంట్రాక్టర్లు తమ సొంత నిధులతో పనులు పూర్తిచేయగా, ప్రభుత్వం వారికి వార్షిక వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తుంది. 

కుప్పంలో పనులు ప్రారంభించిన త‌ర్వాత‌ సీఎం చంద్రబాబు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మునిసిపల్ శాఖ అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాలువను సందర్శించి కృష్ణా జలాలకు సీఎం జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం ఈసీ పౌల్ట్రీ షెడ్ కార్యక్రమం కింద ఎంపికైన కొందరు లబ్ధిదారులతో ముచ్చటించి, మధ్యాహ్నం పార్టీ కేడర్‌తో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduAndhra Pradesh Urban DevelopmentHybrid Annuity ModelKuppam Development WorksGVMC Infrastructure ProjectsAP Municipal Infrastructure

More Telugu News

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17

హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తాగునీటి లభ్యతపై ఆందోళన!

06 Nov, 22:47

చీరాలలో 10 స్థానాల్లో గెలుపు.. కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం: షర్మిల

06 Nov, 22:27

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ రేపే.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

06 Nov, 22:18

చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా, చైర్‌పర్సన్‌గా హనీ స్పందన విజయం

06 Nov, 22:04

ఓబీసీ క్రీమీ లేయర్‌లో తల్లిదండ్రుల జీతం లెక్కించడం కుదరదన్న సుప్రీంకోర్టు.. కేంద్రం అభ్యర్థన తిరస్కరణ

06 Nov, 21:47

పెన్షనర్లకు అలర్ట్: నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ కట్!

06 Nov, 21:41

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

06 Nov, 21:32

ఆ చర్చలు ఆపండి.. 'రామాయణ' గురించి సల్మాన్ ఖాన్ కామెంట్స్

06 Nov, 21:26
..More Telugu News