Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఫిర్యాదు

Actress Radha files sensational complaint against sister Ambika
Advertisement
  • రూ. 46 కోట్ల కోసం తన చెక్కులను దుర్వినియోగం చేశారని ఆరోపణ
  • ఇంట్లో ఉంచిన బ్లాంక్ చెక్కులను దొంగిలించారని ఫిర్యాదు
  • ఏడాదిన్నరగా తన ఆస్తిలోకి అడుగుపెట్టనివ్వడం లేదని ఆవేదన
Advertisement
ప్రముఖ నటి రాధ కుటుంబంలో ఆర్థిక వివాదం చెలరేగింది. తన సోదరి, నటి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌లపై రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన సంతకం కలిగిన బ్లాంక్ చెక్కులను ఉపయోగించి రూ. 46 కోట్లు కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 21న చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదులో రాధ పేర్కొన్న వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల నిమిత్తం ఆమె 'ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో' పేరుతో ఉన్న ఐడీబీఐ బ్యాంకు కరెంట్ ఖాతాను నిర్వహిస్తున్నారు. సిబ్బంది వేతనాలు, పన్నులు, ఇతర ఖర్చుల కోసం కొన్ని చెక్కులపై ముందుగానే సంతకం చేసి చెన్నైలోని తన నివాసంలో ఉంచేవారు. 2025 జనవరి నుంచి ఈ సంస్థ పేరు 'ఆర్ఆర్ గార్డెన్స్‌'గా మారనున్న నేపథ్యంలో పాత చెక్కుల వాడకాన్ని నిలిపివేశారు. అయితే, ఆ పాత చెక్కు పుస్తకంలోని ఐదు చెక్కులను తన సోదరుడు మల్లికార్జున, సోదరి అంబిక దొంగిలించారని ఆమె ఆరోపించారు.

సెప్టెంబర్ 17న అంబిక పేరుతో రూ. 46 కోట్ల కోసం ఈ ఐదు చెక్కులను బ్యాంకులో సమర్పించినట్లు బ్యాంకు అధికారులు తనకు సమాచారం అందించారని రాధ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఆమె, ఆ చెక్కుల చెల్లింపును నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించారు. అంబికకు తాను ఎటువంటి చెక్కులు ఇవ్వలేదని, అంత పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన ఒప్పందం ఏదీ తమ మధ్య లేదని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాకుండా, గత ఏడాదిన్నర కాలంగా తనను తన ఆస్తిలోకి అడుగుపెట్టనివ్వడం లేదని, అక్కడ విలువైన వస్తువులు, నగలు, పత్రాలు ఉన్నాయని కూడా రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా రాణించిన అక్కాచెల్లెళ్ల మధ్య తలెత్తిన ఈ వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement
Radha
Ambika
Actress Radha Complaint
Radha Ambika Dispute
46 Crore Fraud Case

More Telugu News