హరిబాబు హత్య కేసులో పురోగతి.. బావమరిది సంతోష్ అరెస్ట్

Telangana
Advertisement
  • నిజామాబాద్‌లో హరిబాబును కత్తితో పొడిచి హత్య
  • చెల్లెలి మృతికి ప్రతీకారంగా బావను చంపినట్టు చెప్పిన సంతోష్
  • విశాఖకు పారిపోతుండగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
  • హత్యను ప్రోత్సహించిన తల్లి, బంధువుల కోసం గాలింపు!
నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసు నిందితుడు, యూట్యూబర్ వైష్ణవి సోదరుడు గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16న హరిబాబు తన భార్య వైష్ణవిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో హరిబాబు, అతడి తల్లి, ఇద్దరు సోదరులు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు.

అప్పటి నుంచి హరిబాబు తల్లి నిజామాబాద్‌లోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. నెల రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన హరిబాబు, తన తల్లిని చూసేందుకు ఈ నెల 17న నిజామాబాద్ వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వైష్ణవి అన్న సంతోష్, హరిబాబుపై కత్తితో దాడి చేసి హతమార్చి కారులో పరారయ్యాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అనంతరం ఈ హత్యను తానే చేశానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగా హరిబాబును అంతమొందించానని నిందితుడు సంతోష్ అదే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శనివారం నిజామాబాద్ బైపాస్ వద్ద రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంతోష్ తల్లి రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ ప్రోత్సహించారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని, అరెస్ట్ చేసిన సంతోష్‌ను రిమాండ్‌కు తరలిస్తామని ఆయన వివరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Gandham SantoshChittari HaribabuNizamabad murder caseYoutuber VaishnaviRevenge murderTelangana Police

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News