జన్వాడ ఫామ్‌హౌస్ నాది.. కేటీఆర్‌కు సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి

Telangana
Advertisement
  • జన్వాడ ఫామ్‌హౌస్ తనదేనని స్పష్టం చేసిన యజమాని ప్రదీప్ రెడ్డి
  • కేటీఆర్‌కు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చానని వెల్లడి
  • ఫామ్‌హౌస్ కు సంబంధించి ఎలాంటి భూ వివాదాలు లేవని స్పష్టీకరణ
  • రాజకీయ పార్టీల నేతలు తనిఖీకి రావడం సరికాదని వ్యాఖ్య
  • చట్టప్రకారం ఏ విచారణకైనా సహకరిస్తానని హామీ
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన జన్వాడ ఫామ్‌హౌస్ వివాదంపై దాని యజమాని ప్రదీప్ రెడ్డి స్పందించారు. ఆ ఫామ్‌హౌస్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి సంబంధం లేదని, అది తన వ్యక్తిగత ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ఫామ్‌హౌస్‌ను సందర్శించాలని యోచిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, "జన్వాడలోని ఫామ్‌హౌస్ భూమి నాది. కేటీఆర్, నేను చిన్ననాటి స్నేహితులం. ఆ ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌కు లీజుకు ఇచ్చాను. అంతకుమించి దీనితో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు" అని తెలిపారు. ఆ భూమికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవని, అన్ని పత్రాలు చట్టబద్ధంగా, సక్రమంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వానికి గానీ, సంబంధిత అధికారులకు గానీ ఏవైనా అనుమానాలు ఉంటే, తనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని ప్రదీప్ రెడ్డి సూచించారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, ప్రైవేట్ ఆస్తి వద్దకు రాజకీయ నేతలు వచ్చి తనిఖీలు చేయడం, దీనిని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టప్రకారం జరిగే ఎటువంటి విచారణకైనా తాను పూర్తిగా సహకరిస్తానని ప్రదీప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pradeep ReddyJanwada FarmhouseKT Rama RaoKTRTelangana Politics

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News