తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా వినాయక చవితి పూజ.. లేటెస్ట్ ఫొటోతో పెళ్లి వార్తలకు బలం!

Entertainment
Advertisement
  • వినాయక చవితి పూజ తర్వాత ఈషా రెబ్బాతో ఫొటో పంచుకున్న తరుణ్ భాస్కర్
  • అందరిలోనూ మరోసారి పెరిగిన ఆసక్తి
  • గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ టాలీవుడ్‌లో ప్రచారం
  • సరైన సమయంలో అన్ని విషయాలు ప్రకటిస్తానని గతంలో చెప్పిన తరుణ్
  • ఈ పోస్ట్‌తో వీరి పెళ్లి వార్తలపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి
Advertisement
టాలీవుడ్ యువ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు మరోసారి బలం చేకూరింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వీరిద్దరూ జంటగా పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తరుణ్ భాస్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. దీంతో వీరి పెళ్లి వార్తలపై మరోసారి టాలీవుడ్‌లో జోరుగా చర్చ మొదలైంది.

గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు సినిమా కార్యక్రమాలకు, ఈవెంట్లకు వీరిద్దరూ జంటగా హాజరవుతూనే ఉన్నారు. అంతేకాకుండా, తరుణ్ తల్లితో కలిసి ఈషా విమానాశ్రయాల్లో, షాపింగ్‌లో కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' చిత్రంలో తరుణ్, ఈషా జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడి, అది ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అయితే, ఇప్పటివరకు ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై తరుణ్ గానీ, ఈషా గానీ నేరుగా స్పందించలేదు. గతంలో ఓ సందర్భంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఈషా తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని పేర్కొన్నారు. సరైన సమయంలో అన్ని విషయాలు వెల్లడిస్తానని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన తాజా హింట్‌తో, ఆ సరైన సమయం ఆసన్నమైందని, త్వరలోనే ఈ జంట శుభవార్త చెబుతుందేమోనని అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, తరుణ్ భాస్కర్ తాజా పోస్టుపై మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక, షాలిని కొండెపూడి వంటి తారలు స్పందించి విషెస్ చెప్పడం విశేషం. 
Advertisement

సంబంధిత వార్తలు

Tharun BhasckerEesha RebbaVinayaka Chavithi PujaTollywood Marriage NewsOm Shanthi Shanthi ShanthiTharun Bhascker Eesha Rebba Marriage

More Telugu News

స్టాక్ మార్కెట్లో జియో సంచలనం... ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద టెల్కోగా అవతరణ!

29 Oct, 10:30

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు? అశ్విన్‌ ఏమన్నాడంటే..!

29 Oct, 10:27

102 ఉద్యోగాలకు టీజీపీఎస్‌సీ నుంచి కొత్త‌ నోటిఫికేషన్‌

29 Oct, 10:24

భారత్‌తో సిరీస్: న్యూజిలాండ్‌కు డబుల్ షాక్.. ఇద్దరు స్టార్ పేసర్ల ఔట్

29 Oct, 10:20

కేవలం రూ.1,552 అదనపు ధర.. కొత్త ఫీచర్లతో కేటీఎం 200 డ్యూక్‌!

29 Oct, 10:18

ఏఐతో 90 శాతం ఉద్యోగాలు పోతాయా?.. జోహో అధినేత కీలక విశ్లేషణ

29 Oct, 09:50

స్ట్రోక్ వస్తే ప్రాణాలు కాపాడే ‘FAST’ సూత్రం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!

29 Oct, 09:48

సంతకం చేయలేదు.. మెసేజ్‌ రాలేదు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.35 కోట్లు గోల్‌మాల్‌!

29 Oct, 09:44

డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలు.. 15 ఏళ్ల కశ్వికి జాక్‌పాట్

29 Oct, 09:42

కొత్త ఉత్పత్తులు లాంచ్ చేసిన రోజే.. మరోసారి లేఆఫ్స్.. 250 మందిని తొలగించిన అమెజాన్

29 Oct, 09:33

మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌.. సీఎం ఫడ్నవీస్‌ సొంత ప్రాంతంలో కాంగ్రెస్‌ విజయం!

29 Oct, 09:37

మనోజ్ బాజ్ పాయ్ కోసం చూడాల్సిన 'గజబ్ రాత్'

29 Oct, 09:19

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.. కాంగ్రెస్‌కు ఒక్కటే సీటు!

29 Oct, 09:56

బలూచిస్థాన్‌లో పాక్ సైన్యంపై భారీ దాడి.. 80 మందిని చంపామన్న బీఎల్ఎఫ్

29 Oct, 08:57

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం.. భారత మార్కెట్లపై ప్రభావం ఎంత?

29 Oct, 08:55
..More Telugu News