దులీప్‌ ట్రోఫీలో ఇషాన్‌ కిషన్‌ చరిత్ర.. 39 ఏళ్ల రికార్డు బద్దలు!

10-09-2026 Thu 08:09 | Sports
Advertisement
  • దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఇషాన్‌ కిషన్‌ రికార్డుల మోత
  • తొలి ఇన్నింగ్స్‌లో 270, రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులు
  • ఒకే మ్యాచ్‌లో 350 పరుగులతో సరికొత్త చరిత్ర
  • 39 ఏళ్ల నాటి రామన్‌ లాంబ రికార్డును అధిగమించిన కిషన్‌
  • మానసిక ప్రశాంతతే తన విజయ రహస్యమని వెల్లడి
Advertisement
భారత యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 39 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. సౌత్‌ జోన్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 350 పరుగులు సాధించాడు. దీంతో దులీప్‌ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఈస్ట్‌ జోన్‌కు కిషన్‌ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 344 బంతులు ఎదుర్కొని ఏకంగా 270 పరుగులు చేశాడు. అతడి భారీ డబుల్ సెంచరీ సాయంతో ఈస్ట్‌ జోన్‌ 708 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌ జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించిన ఇషాన్‌, కేవలం 98 బంతుల్లో 80 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ ప్రదర్శనతో దులీప్‌ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఇషాన్‌ నిలిచాడు. ఇంతకుముందు 1987 అక్టోబర్‌లో భిలాయ్‌లో వెస్ట్‌ జోన్‌పై నార్త్‌ జోన్‌ తరఫున ఆడిన రామన్ లాంబ 320 పరుగులు చేసిన రికార్డును కిషన్‌ సునాయాసంగా అధిగమించాడు.

ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో క్లిష్ట దశ తర్వాత మానసికంగా చాలా తేలికపడ్డానని చెప్పాడు. "అనవసరమైన ఆలోచనలు, అంచనాలను మనసులోంచి తీసేశాను. బ్యాటర్‌గా పరుగులు చేయడమే మన పని అని గ్రహించాను. ఇతర ఆలోచనలు మన మైండ్‌సెట్‌ను దెబ్బతీసి, ఒత్తిడిని పెంచుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆట సులభం అవుతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం నేను దేని గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. బంతిని చూసి దానికి తగ్గట్టు స్పందించడమే నా పని" అని వివరించాడు.

గతంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి ఇబ్బందులు పడ్డ ఇషాన్‌ కిషన్‌, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ ప్రదర్శనతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
Advertisement
Ishan KishanDuleep TrophyEast ZoneMA Chidambaram Stadium ChennaiSouth ZoneRaman Lamba

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more