'నువ్వెవరో నాకు తెలీదు.. కానీ నేనెవ‌రో ప్ర‌పంచం మొత్తానికి తెలుసు'.. బిగ్ బాస్ హౌస్‌లో మేరీ కోమ్ ఫైర్!

09-09-2026 Wed 11:08 | Entertainment
Advertisement
  • బిగ్ బాస్ 20 హౌస్‌లో మొదలైన గొడవలు
  • కిచెన్ పనుల విషయంలో మేరీ కోమ్, రితి తివారీ మధ్య వాగ్వాదం
  • "నువ్వెవరో నాకు తెలియదు" అంటూ రితిపై మేరీ కోమ్ ఆగ్రహం
  • మీ మరో కోణాన్ని కూడా ప్రపంచం చూస్తుందంటూ రితి కౌంటర్
Advertisement
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20' ప్రారంభమైన కొద్ది రోజులకే హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ మేరీ కోమ్, మరో కంటెస్టెంట్ రితి తివారీ మధ్య వంటగదిలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రోమో ప్రకారం, వంటగదిలో ఉన్న మేరీ కోమ్.. పాత్రలు కడిగే డ్యూటీ ఎవరిదని అడగడంతో గొడవ మొదలైంది. అక్కడే ఉన్న రితి తివారీ, ఆ డ్యూటీ తనదేనని, అయితే ప్రస్తుతం అందరి కోసం టీ పెడుతున్నానని సమాధానమిచ్చింది. దీనికి మేరీ కోమ్ స్పందిస్తూ, "టీ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది?" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అసహనానికి గురైన రితి, అయితే మీరే టీ పెట్టండి అంటూ ఘాటుగా బదులిచ్చింది. "నాకేం చేయాలో నాకు తెలుసు. మీకు చాలా గౌరవం ఇస్తాను, కానీ నా వెనుక నా గురించి మాట్లాడొద్దు" అని మేరీ కోమ్‌కు స్పష్టం చేసింది. 

దీంతో కోపగించుకున్న మేరీ కోమ్.. "ప్రపంచం మొత్తానికి నేను తెలుసు. మీరెవరో నాకు తెలియదు" అని అన్నారు. దీనికి రితి కూడా గట్టిగానే బదులిస్తూ.. "మేరీ కోమ్ మరో కోణాన్ని కూడా త్వరలో ప్రపంచం చూస్తుంది" అని కౌంటర్ ఇచ్చింది.

సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ 20వ సీజన్‌లో మేరీ కోమ్, కనికా మాన్, మహీ విజ్, ఆమ్రపాలి దూబే, రితి తివారీ సహా మొత్తం 16 మంది సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. ఈ షో కలర్స్ టీవీ, జియోహోస్టార్‌లో ప్రసారం అవుతోంది.
Advertisement
Mary KomBigg Boss 20Riti TiwariMary Kom Bigg Boss fightBigg Boss 20 contestantsColors TV reality show

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more