‘వాళ్లు బాత్‌రూమ్‌కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’.. ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

03-09-2026 Thu 13:58 | International
Advertisement
  • ఇరాన్‌పై అమెరికా నిఘా పూర్తిస్థాయిలో ఉందన్న ట్రంప్‌
  • అవసరమైతే మరోసారి దాడి చేస్తామని హెచ్చరిక
  • హర్మూజ్‌పై తమకు బలమైన పట్టు ఉందని వెల్లడి
  • ఇరాన్‌ తాజా దాడుల్లో 18 మంది మృతి
  • అమెరికా స్థావరాలపై ఇరాన్‌ ప్రతిదాడులు
Advertisement
అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌పై తమ నిఘా ఎంత పకడ్బందీగా ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌లో ఏం జరుగుతుందో తమకు ఎప్పటికప్పుడు తెలుస్తోందన్నారు. అవసరమైతే ఎప్పుడైనా మరో దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

ఓవల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. తాజా ఘర్షణ ఎక్కువ కాలం సాగదని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ కదలికలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందన్నారు. ‘‘వాళ్లు బాత్‌రూమ్‌కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’’ అంటూ అమెరికా నిఘా సామర్థ్యాన్ని వివరించారు.

హర్మూజ్‌ జలసంధిపై తమకు బలమైన పట్టు ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇరాన్‌ ఏర్పాటు చేస్తున్న రాడార్‌, క్షిపణి వ్యవస్థలను అమెరికా గుర్తించిందన్నారు. సముద్రంలో మైన్స్‌ వేసేందుకు ఇరాన్‌ సిద్ధం చేస్తున్న రాకెట్‌ను దాడిలో ధ్వంసం చేశామని చెప్పారు. 

తాజా అమెరికా దాడుల్లో ఇరాన్‌లో కనీసం 18 మంది చనిపోయారు. మరో 108 మంది గాయపడ్డారు. హర్మూజ్‌ సమీపంలోని కుహెస్తాక్‌లో జరిగిన వివాహ వేడుకపై కూడా దాడి జరిగినట్లు టెహ్రాన్‌ తెలిపింది. 

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ కూడా ఎదురుదాడులకు దిగింది. కువైట్‌, జోర్డాన్‌, యూఏఈ, బహ్రెయిన్‌, ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లో ఇరాన్‌ నుంచి వచ్చిన క్షిపణి, డ్రోన్‌ దాడిని అడ్డుకున్నట్లు అక్కడి సైన్యం తెలిపింది.
Advertisement
Donald TrumpIran US tensionsUS surveillance on IranHormuz Strait conflictIran retaliatory strikesMiddle East security

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more