నా జీవితంలో మీరే ఫస్ట్ హీరో.. చిరంజీవి పోస్టుపై పవన్ భావోద్వేగ స్పందన
- తండ్రి స్థానంలో నిలిచి దారి చూపారని కొనియాడిన పవన్ కల్యాణ్
- చిన్నప్పటి నుంచి తనపై చూపిన విశ్వాసం, మద్దతు ఎంతో ప్రత్యేకం అని వెల్లడి
- మీ ఆశీస్సులతో ముందుకు సాగుతానంటూ అన్నయ్యకు ధన్యవాదాలు
తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి అందజేసిన శుభాకాంక్షలకు జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో చిరంజీవి స్థానం ఎంతటిదో వివరిస్తూ బుధవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందేశం మరోసారి చాటిచెప్పింది.
"మీ ప్రేమ, ఆప్యాయత, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్యా. చిన్నతనం నుంచి నాపై మీరు చూపిన విశ్వాసం, మద్దతు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం. తండ్రి స్థానంలో నిలిచి నాకు మార్గనిర్దేశం చేశారు. నా జీవితంలో మీరే తొలి హీరో" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
"జీవితంలో గమ్యం తెలియని రోజుల్లో నాకు దిశానిర్దేశం చేసిన మీ మాటలు, ఆలోచనలు నేటికీ నాలో సజీవంగా ఉన్నాయి. కుటుంబం పట్ల మీకున్న మమకారం, సమాజం పట్ల మీ బాధ్యత, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు దిశానిర్దేశం చేశాయి. మీరు నా జీవితంలో ఎప్పటికీ మార్గదర్శిగానే ఉంటారు. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు, మీ దీవెనలతో ముందుకు సాగుతాను" అని ఆయన తన పోస్ట్‌లో వివరించారు.
అంతకుముందు, చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ సందేశాన్ని ఉంచారు. ఉప ముఖ్యమంత్రిగా గ్రామాభివృద్ధి, గిరిజన సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పవన్ కనబరుస్తున్న అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. పిఠాపురం ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారని కొనియాడారు. ప్రజా సేవలో నిమగ్నమైన పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.